జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మే 22
ఏలూరు,మే, 21: ఈవిఎంలు భధ్రపరచిన ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులోని సి.ఆర్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో డ్రోన్లతో వీడియో, ఫొటోలు చిత్రీకరణ నిషేధిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవిఎంలు భధ్రపరచిన స్ట్రాంగ్ రూమ్ పరిధిలో మూడంచెల భధ్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వట్లూరులోని సి.ఆర్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల పరిధిలోని ప్రాంతాన్ని ఈనెల 20వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు నో ప్లై జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అదే విధంగా పోలింగ్ కు వినియోగించిన ఈవిఎంలు, వివిప్యాట్ లు భధ్రపరచిన వట్లూరులోని సి.ఆర్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం, చుట్టుప్రక్కల ఎటువంటి డ్రోన్లు ఎగరకుండా అన్ని భధ్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.





