రాజకీయంగా ఎదుర్కోలేకనే నాపై తప్పుడు ప్రచారం అవకతవకలు జరిగుంటే ఆధారాలతో సహా నిరూపించండి మూల మధుకర్ రెడ్డి

Spread the love

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ మార్చి 30

తప్పుడు ఆరోపణ చేస్తే సహించేది లేదు
సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిని సంఘ సభ్యులు నిలదీయాలి.
బయ్యారం మండల పరిధిలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మూల మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు మహాజనసభ నిర్వహించారు. ఈ మహాజన సభకు ముఖ్య అతిథులుగా జిల్లా కోఆపరేటివ్ అధికారులు రాజశేఖర్ రెడ్డి పత్య నాయక్, పాలకవర్గ సభ్యులు హాజరైనారు. అనంతరం సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మహాజన సభ ముఖ్య ఉద్దేశం సొసైటీలో జరిగిన లావాదేవీలను సంఘ సభ్యుల సమక్షంలో తెలియజేయడమేనని మా యొక్క పాలకవర్గం ఏర్పడ్డ కానుండి ఈ రోజు వరకు సంఘం అభివృద్ధి గాని సంఘం ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా ధాన్యం కొనుగోలు, ఎరువుల అమ్మకాలు ఇతర వ్యాపారాల ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క లావాదేవీలను ఆడిట్ చేయించడం జరిగిందని, ఎటువంటి అవకతవకలు జరగలేదని అన్నారు. కానీ గత కొద్ది రోజులుగా నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక బయ్యారం సొసైటీలో అవకతవకలు జరిగాయని కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాటి వెనుకాల కుట్రలను సొసైటీ సభ్యులు కులం కుశంగా అర్థం చేసుకోవాలని, ఎవరు ఏంటో మీరు తెలుసుకుని మన సొసైటీ పై పాలకవర్గంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వ్యక్తులను నిలదీయాల్సిన బాధ్యత సంఘ సభ్యులకు ఉందన్నారు. కావాలనే కొందరు వ్యక్తులు సొసైటీ అభివృద్ధిని జీర్ణించుకోలేక పాలకవర్గంపై చైర్మన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నిజంగానే సంఘంలో అవకతవకలు జరిగుంటే ఆధారాలతో సహా ఆ వ్యక్తులు ఈ మహాజన సభకు హాజరై సభ్యుల ముందు నిరూపించేవారని, ఎక్కడో ఉండి నాపై ఏదో ఉద్దేశపూర్వంగా కావాలని సోషల్ మీడియాలో బదనం చేస్తూ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు వేల్పుల శ్రీనివాస్,తెల్లం బిక్షం,తిరుమల ప్రభాకర్ రెడ్డి,వేముల కళింగ రెడ్డి,గంగుల సత్యనారాయణ,గాడిదల కేత మల్లు,బండారు మల్లయ్య,నద్దునూరి యశోద,చెరుకుపల్లి నాగమణి,సంఘ సీఈవో అనూష,సంఘ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి