చిట్వేలి జనసముద్రం మార్చి 30
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం సుదీర్ఘ రాజకీయ అనుభవం అపార చాణిక్యుడు 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కి జెండాలు మోసిన కార్యకర్తకు వారికి న్యాయం చేయడమే అపవాది ఉంది ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గంలో బలపడడానికి శక్తి వంచన లేకుండా కృషిచేసిన బత్యాల చెంగల రాయుడు నేడు ఆయనకు జరిగిన అన్యాయంపై కార్యకర్తలలో తీవ్ర అగ్రహారం ఉన్నాయి రాజంపేట నియోజకవర్గంలో నాన్ లోకల్ గా వెళ్లి అందరి బంధువుగా ఆత్మబంధువుగా ప్రతి కార్యక్రమానికి హాజరై సొంత మనిషి అనిపించుకున్న అలాంటి వ్యక్తికి చంద్రబాబు చేసిన అన్యాయం పట్ల స్థానిక కార్యకర్తలు రగిలిపోతున్నారు నమ్మిన వారికి మోసం చేసే అలవాటు బాబుకు ఉందని అపవాదు ఉంది అది నిజమేమోనని ప్రజలు చర్చించుకుంటున్నారు బత్యాల ప్రభావం కేవలం రాజంపేట లోనే కాదు కోడూరు రాజకీయాలలో ఆయన పెద్దన్న పాత్ర పోషించే సత్తా ఉన్న నాయకుడని అలాగే తిరుపతి రాజకీయాలను కూడా కొద్దిగా ప్రభావితం చేయగల వ్యక్తి అని అలాంటి వ్యక్తికి నిజంగా ఇలాంటి శిక్ష వేయడం బాధాకరమని ఇంకా ఐవీఆర్ఎస్ సర్వేలను పట్టుకుని కంప్యూటర్ల ముందు కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే తర్వాత జరిగే నష్టాన్ని అంచనా వేయడం కష్టతరం అవుతుందని నిజమైన తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు తీవ్ర ఆక్రోషం వెళ్లగకుతున్నారు అలాగే గత 20 సంవత్సరాల నుండి పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కార్యకర్తలకు అనునిత్యం అండగా ఉంటూ పార్టీని కోడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా ప్రస్తుతం చంద్రబాబు విలువ ఇవ్వడం లేదేమోనని కార్యకర్తలలో ఉంది చంద్రబాబుకి డబ్బుంటేనే రాజకీయాలు చేయొచ్చని ఆలోచన ఉన్నట్లు ఉంది ఏమో అని ప్రస్తుతం డబ్బున్న వారికే పదవులు కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది అధికారపక్ష నాయకుడు పేద ప్రజల పాలిట ఆపద్బాంధవుడు సంక్షేమ కార్యక్రమాల సృష్టికర్త ముఖ్యమంత్రి జగన్ కష్టమైనా నష్టమైన తన నమ్ముకున్న వారికి తన పార్టీకి అన్యాయం జరిగిన నాయకులకు న్యాయం చేయడంతో పాటు కార్యకర్తలను కూడా ఆదుకుంటాడు అని బలమైన అభిప్రాయం ప్రజలలో వ్యక్తమవుతున్నది రిజర్వేషన్ నియోజకవర్గంలో కూడా ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసే యోధుడు పార్టీ ప్రచారాల కోసం అభివృద్ధి కోసం తనదైన శైలిలో కృషి చేసే నాయకుడు కార్యకర్తలకు అండగా ఉంటూ గత పది సంవత్సరాల నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నరసింహ ప్రసాద్ కు కూడా సరైన న్యాయం జరగలేదని 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గ ప్రజల్ని వదలకుండా పార్టీని వదలకుండా తెలుగుదేశం కార్యకర్తలను వదలకుండా ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరవుతూ తెలుగుదేశం ప్రజల్లో మన్నన పొందుతూ 2024 ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థి పంతగాని నరసింహ ప్రసాద్ అని నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త అనుకున్నాడు . కానీ అందరూ అంచనాలకు విరుద్ధంగా ఉమ్మడి పార్టీ అని ఉమ్మడి అభ్యర్థి అని యనమల భాస్కరరావుకి టికెట్ కేటాయించటం తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం చేసిందంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం అవుతుంది. సంవత్సరాలు నుండి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులకి కోడూరు నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గంలో జరిగినటువంటి సందర్భం చూస్తే పార్టీని నమ్ముకుని జెండాలు మోసే వారికి ఎంతవరకు న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లో తీవ్ర అలజడి వ్యక్తం అవుతున్నది ఇప్పటికైనా స్పందించి చంద్రబాబు సీనియర్లకు విలువ ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో అయినా విడిపోయిన జిల్లాల ప్రభావం వల్ల కోడూరు ,రాజంపేట , తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలుస్తుందని కార్యకర్తలు నాయకులు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తా కానీ ఇలాంటి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల రాజంపేట, కోడూరు, అసెంబ్లీ స్థానాలను వైసిపి అభ్యర్థులకు గెలుపును బంగారు పళ్లెంలో పెట్టించినట్టు ఉందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు రాజంపేట కోడూరు స్థానాలపై తగు చర్య తీసుకొని బలంగా అసెంబ్లీ అభ్యర్థులకు బత్యాల చెంగల్రాయుడికి, పంతగాని నరసింహ ప్రసాద్ కి టికెట్ కేటాయించి తెలుగుదేశం జెండా ఎగురువేయాలని ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు భావిస్తున్నారు.





