ప్రశాంత, సమర్థవంతంగా ఎన్నికల నిర్వహనే లక్ష్యం. మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌.

Spread the love

జనసముద్రం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా. 30 మార్చి 2024.

రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నదే లక్ష్యంగా అవసరమైన శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  అన్నారు.  ఇ.వి.ఎమ్ గోడౌన్ ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సాధారణ ఎన్నికలు సమర్థవంతంగా, పటిష్టంగా నిర్వహించేలా ప్రతీ నియోజక వర్గంలో ఈ.వి.ఎమ్, వి.వి ప్యాట్ లపై శిక్షణ అందించనున్నామని అన్నారు. దీని కొరకు నియోజక వర్గ స్థాయిలో ఆరు ఈ.వి.ఎమ్ ల చొప్పున అందించనున్నామని తెలిపారు. ఈ. వి.ఎమ్ లపై ఎటువంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేసి ఎన్నికలు సాఫీ గా జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ.వి.ఎమ్ ల శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణకు అందరూ సహకారం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

కంట్రోల్ రూమ్ పనితీరు పరిశీలన

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ పనితీరు, నిఘాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వెబ్ కాస్టింగ్ ద్వారా ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద వాహనాల తనిఖీలను పరిశీలించారు. జి.పి. ఎస్. సిస్టం  తో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల వాహనాలు ఉన్న ప్రదేశాల పర్యవేక్షణను, ప్రసార మాధ్యమాలు ద్వారా  సోషల్ మీడియాలో ప్రసారమౌతున్న కార్యక్రమాల్లో యాడ్ వర్క్ వార్తలపై నిఘా, సి – విజల్ ఫిర్యాదుల నమోదు, తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక,కంట్రోల్ రూం ఇన్ ఛార్జ్ అధికారి,
ఎస్డిసి ఆర్ వి సూర్యనారాయణ, టిడిపి, లోక్ సత్తా, జె ఎస్ పి రాజకీయ పార్టీ ప్రతినిధిలు జి .వెంకట నాయుడు, కె . పాపా రావు, పి.శ్రీనివాస్ రావు, ఇన్చార్జి డి అర్ ఓ జీ.కేశవ నాయుడు, తాసిల్దార్ కె.ఆనందరావు, డిప్యూటీ తాసిల్దార్ వెంకట రమణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వి.రామ కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్