శామీర్ పేట జనసముద్రం న్యూస్ జూలై 29
మోహార్రం పండుగ సందర్భంగా జెడ్పీటీసీ అనితా లాలయ్య, కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ లు అలియా బాద్ గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా గ్రామ సర్పంచ్ గుర్క కుమార్ యాదవ్ అనితా లాలయ్య, అఫ్జల్ ఖాన్ లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గుర్క కుమార్ యాదవ్ మాట్లాడుతు అఫ్జల్ ఖాన్ ఎమ్మెల్సీ పదవి రేసు లో ఉన్నందున ఆనందం వ్యక్తం చేశారు. అఫ్జల్ ఖాన్ కు ఎమ్మెల్సీ పదవి రావాలని కోరారు. అఫ్జల్ ఖాన్ కు ఎమ్మెల్సీ పదవి రావడం కోసం తన పూర్తి మద్దతు ఇస్తామని అలియా బాద్ సర్పంచ్ గుర్క కుమార్ యాదవ్ మాట్లాడుతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనితా లాలయ్య,అఫ్జల్ ఖాన్, గుర్క కుమార్ యాదవ్ లతో పాటు ,తాడెం కుమార్,తాళ్ళ జగదీష్ గౌడ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.