
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సీరోలు మండలం, జడ్పీహెచ్ఎస్ కొత్తూరు సిగ్రామం లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీగా తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు, విద్యాభివృద్ధి గురించి నినాదాలు ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత పాఠశాల ఇంచార్జ్ ఉపాధ్యాయులు ఎస్.సుగుణాకర్ పతాకావిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన కొత్త.సౌమ్యను, వారి తల్లిదండ్రులను శాలువా మెమెంటో తో గ్రామ సర్పంచ్ యానాల గంగాధర్ రెడ్డి మరియు పాఠశాల చైర్మన్ చిప్పరపల్లి సైదులు గారు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అశోక్ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు జి.భద్రు, ఏ.రవికుమార్, ఆర్.వెంకటాచలం, పి.శ్రీనివాస్, ఎస్.కె.దస్తగిరి గార్లు పాల్గొన్నారు.






