ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ సంతోష్ కుమార్

Spread the love

తెలంగాణ రన్ కుసుమ జగదీష్ కి అంకితం.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి జూన్ 12 :(తుపాకుల రమేష్)

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో పిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచర్ల నుండి డెకాథ్లాన్ వరకు మూడు కిలోమీటర్ల తెలంగాణ రన్ నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని సీఎం కేసీఆర్ వెంట నడిచిన ఉద్యమకారుడు, ములుగు జడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ గారి సంతాప సూచికగా రెండు నిమిషాలు పాటు మౌనం పాటించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ బహుముఖ రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీసు వ్యవస్థ శాంతి భద్రతలను అదుపులో ఉంచడంతోనే అభివృద్ధి సాధ్యం అయిందని, ఇతర రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా సాధించలేని అభివృద్ధి తెలంగాణ దశాబ్ద కాలంలోనే సాధించగలిగామన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేర పరిశోధన వేగవంతం అయిందని, నేరశాతం కూడా తగ్గుముఖం పట్టిందని, పోలీసు శాఖలోని వివిధ విభాగాల సమన్వయంతో ఎటువంటి నేరం అయినా ఒకే రోజులో నేరస్తులను పట్టుకునే స్థాయికి రాష్ట్ర పోలీసు శాఖ చేరుకుందని పేర్కొన్నారు.

మినిస్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాల వల్ల మౌలిక వసతుల కల్పనతో పాటు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు ప్రజలకు అందాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని శాంతి భద్రతల పరంగా ఉన్నత స్థానంలో ఉంచడానికి రాష్ట్ర పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారన్నారు.

రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ మాట్లాడుతూ.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు జరగకుండా, శాంతి భద్రతల పరంగా ప్రశాంతంగా ఉంచడానికి రాచకొండ పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారన్నారు. ఈవ్ టీజింగ్, మహిళల మీద వేధింపులు, చైన్ స్నాచింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, వాహనాల తప్పుడు నంబర్ ప్లేట్లు వంటి ఎన్నో రకాల నేరాల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అందువల్లే రాచకొండ పరిధిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ మొక్కలు నాటారు. మంత్రి మల్లారెడ్డి, డిసిపి మల్కాజిగిరి జానకి ఐపిఎస్, మేడ్చల్ కలెక్టర్ అమెయ్ కుమార్, ఎస్ఓటి డీసీపీలు గిరిధర్, మురళిధర్, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, మల్కాజిగిరి ఏసిపి నరేష్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి