జనసముద్రం న్యూస్,మే 27 :

ఏపీలో గత నాలుగేళ్ళుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ కి ముడిపెట్టి వార్తా కధనాలు వందల్లోనే వచ్చాయి. అలాగే కొన్ని మీడియా సంస్థలు కూడా ఆ హత్య తాము చూసినట్లుగా ఎన్నో విషయాలను ఆసక్తిగా వండి వార్చాయి. మీడియా వరకూ అయితే ఊహాగానాలతో సరిపోతుంది.
కానీ సీబీఐ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఒక ముఖ్యమంత్రి పేరుని వివేకా హత్య కేసులో ప్రస్తావించడం అంటే సంచలనే కాదు రాజకీయ ప్రకంపనలుగానే చూడాలి. వైఎస్ వివేకా హత్య కేసు జగన్ కి ముందే తెలుసు అంటూ సీబీఐ అనుబంధ కౌంటర్ లో పేర్కొనడంతో ఇపుడు ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేసే కౌంటర్ గా దీన్ని చూస్తున్నారు.అసలు జగన్ కి ఈ హత్య విషయం ముందే ఎలా తెలిసింది. ఆ ముందే అంటే ఉదయం ఆరు గంటల పదిహేను నిముషాలకు వైఎస్ వివేకా పీయే క్రిష్ణారెడ్డి లోకానికి చెప్పకముందే జగన్ కి తెలుసు అని సీబీఐ అనుమానంగా కూడా చెప్పడం లేదు. తమ దర్యాప్తులో తేలిందని నిర్ధారణకు వచ్చినట్లుగా చెబుతోంది
దాంతో ఇపుడు దీని మీద ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు స్టార్ట్ అవుతున్నాయి. దీని మీద ముఖ్యమంత్రి న్యాయవాదులు అయితే మండిపడుతున్నారు. ఏ ఆధారాలతో సీబీఐ ఇలా ఒక ముఖ్యమంత్రి మీద చెబుతుంది అని నిలదీస్తున్నారు. దీని మీద న్యాయపరమైన చర్యలకు తాము సిద్ధమవుతామని పేర్కొంటున్నారు.
వివేకా హత్య కేసులో సీబీఐ కుట్ర కోణంలో దర్యాప్తు జరుగుతోందని కూడా సీఎం తరఫున న్యాయవాదులు అంటున్నారు. సీఎం పేరుని కౌంటర్ పిటిషన్ లో దాఖలు చేయడం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా సీబీఐ చెబుతున్నది చాలా కాలంగా మీడియాలో వస్తున్న రాస్తున్న వార్తలకు సరిసమానంగా ఉంది అని అంటున్నారు.ముందే చెప్పినట్లుగా మీడియాకు సెన్సేషన్ కావాలి. అందుకే ఏమైనా అల్లి రాయవచ్చు. కానీ సీబీఐ కౌంటర్ వేసింది అంటే అందులో విషయాలకు ఆధారాలు ఉండాలి కదా అంటున్నారు. పైగా ఒక సీఎం మీద అందునా ఒక సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసులో ఇలాంటి అభియోగాలను సీబీఐ మోపుతోంది అంటే బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లే అంటున్నారు.
పైగా సీబీఐ ఇదే కౌంటర్ లో చాలా చెప్పింది. అర్ధరాత్రి గంటకు పైగా వాట్సప్ కాల్ లో అవినాష్ రెడ్డి మాట్లాడాని కూడా పేర్కొంది. అంతే కాదు వైఎస్ వివేకా హత్య వెనక అతి పెద్ద కుట్ర కోణం ఉందని అవినాష్ రెడ్డి ని కస్టోడియన్ ఇంటరాగేషన్ చేస్తేనే తప్ప కుట్ర కోణాలు బయటకు రావు అంటోంది.మొత్తానికి సీబీఐ దూకుడు మీద ఉంది. ఫస్ట్ టైం జగన్ పేరుని అనుబంధ కౌంటర్ లో పేర్కొంది అంటే దీని మీద రాజకీయ దుమారం చెలరేగడం ఖాయం. సీఎం తరఫున న్యాయవాదులు కూడా న్యాయ పోరాటానికి సీబీఐ మీద యాక్షన్ కి దిగాలని చూస్తున్నారని అంటున్నారు.





