నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు : ఏసీపీ గణేష్

Spread the love

జనసముద్రంన్యూస్,ఖమ్మం,మే 23:

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఖమ్మం టౌన్ ఏసీపీ పీవీ గణేష్ హెచ్చరించారు.
పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు రైతులకు విక్రయించే విత్తనాలు, ఎరువులు
నాణ్యత ప్రమాణాలను పాటించేలా మంగళవారం నగరంలోని పలు ఫెర్టిలైజర్‌ దుకాణ యజమానులు మరియు డీలర్లతో ప్రత్యేక సమావేశం ప్రవేటు బడ్జెట్ హోటల్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ..నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలన్నారు. అధీకృత విత్తన, ఎరువుల డీలర్లు ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి నడుచుకోవాలని సూచించారు. ప్రభుత్వం సర్టిఫైడ్‌ చేసిన విత్తనాలను విక్రయించాలని సూచించారు.


నకిలీ విత్తనాల విక్రయాలు అరికట్టేందుకు పోలీసు, వ్యవసాయశాఖ అధికారులతో విస్తృతస్ధాయిలో తనిఖీలు నిర్వహిస్తునమని తెలిపారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామని తెలిపారు.రైతులకు మేలు కలిగించే రీతిలో నకిలీ విత్తనాలతో పాటు నకిలీ పురుగు మందుల విక్రయాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు వ్యవసాయ,పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ వుంటుందని అన్నారు.ఇప్పటికే గడువు తీరిన, నాసిరకం విత్తనాల అమ్మకాలపై అధికారులు దృష్టి పెట్టిన అధికారులు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో విత్తనాల స్టాక్ రిజిస్ట్రర్లు, ఎరువులు, పురుగుల మందుల స్టాక్ వివరాలతో పాటు ఆయా కంపెనీల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, విత్తనాలు , ఎరువులు ఎక్కడ నుండి దిగుమతి చేస్తున్నారనేది తెలుసుకుంటున్నారని అన్నారు.రైతులు కూడా కొత్త వ్యక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులను నమ్మి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయరాదని, వ్యవసాయశాఖ ధ్రువీకరించిన వ్యాపారుల వద్దనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు.
రైతులు విత్తనాలు, ఎరువులు, మందులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు ఎవరైన విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.సమావేశంలో సిఐలు సత్యనారాయణ, స్వామి, శ్రీహరి, ఫర్టిలైజర్ దుకాణాల అధ్యక్షుడు నాగేందర్, మనోహార్ పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!