జనసముద్రం న్యూస్, మే 24 :

ఏపీ రాజకీయం అంతా సంకుల సమరంగా సాగుతోంది. ఉమ్మడి ఏపీ నుంచి అదే జరుగుతోంది. అయితే కమ్మ లేకపోతే రెడ్డి అన్నట్లుగా రాజకీయం విడిపోయింది. ఇపుడు కాపుల పక్షాన మరో పార్టీ ఏర్పడింది. ఇలా ఏపీలో మూడు ప్రధాన సామాజిక వర్గాల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఈ నేపధ్యంలో ఒక నగ్న సత్యం చరిత్రలో మరుగుపడిన విషయాన్ని చారిత్రక పరిశోధకుడు రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ విప్పిచెప్పారు.
ఆయన ఒక ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఈ మూడు ప్రధాన కులాల ఉనికి వాటి చారిత్రాత్మక నేపధ్యం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయలాను వెల్లడించారు. అంతే కాదు శాసనాలలో సైతం నిక్షిప్తం అయిన ఉన్న అనేక విషయాలను ఆధార సహితంగా వివరించారు. 8వ శతాబ్దం వరకూ కమ్మ కాపు రెడ్డి ఈ మూడూ ఒకే కులంగా ఉండేవన్న సత్యాన్ని ముదిగొండ శివప్రసాద్ చెప్పుకొచ్చారు.పొలం కాపుకాసేవారిని కాపులుగా పేర్కొన్నారని అలాగే రెడ్డి అంటే రట్టోడిగానూ రాష్ట్రకూటులుగానూ చెప్పుకునేవారు అని రెడ్లు దేశానికి రక్షణ కల్పించారని వివరించారు. అలాగే కమ్మవాళ్ళు రాజ్యాలనే ఏలేవారు అని. అలా కరికాల చోళుడికి కమ్మలతో లింకులు ఉన్నట్లుగా శాసనాలు లభించాయి అని ఆయన తెలియచేశారు. రాజ్యాధికారం కోసం ఈ మూడు కులాలు నెమ్మదిగా తరువాత శతాబ్దాలలో విడిపోయినట్లు చెప్పారు.
చరిత్రలు ఒక్కసారి తీసుకుంటే అన్ని కులాలు రాజ్యాలు ఏలిన సందర్భాలు ఉన్నాయి. శతాబ్దాల క్రితం ఎక్కడికక్కడ స్థానిక రాజులు తమ ప్రతిభను పౌరుషాన్ని చూపించి పాలించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఆనాడు కుల భావన ఎక్కువగా ఉండేది కాదు అన్నది చరిత్ర పుటలను గమనిస్తే అర్ధమవుతుంది.ఎపుడైతే వలస పాలకుల చేతులలోకి దేశం వెళ్ళిపోయిందో నాటి నుంచే విభజించు పాలించు అన్న సిద్ధాంతం మేరకు స్థానికంగా కుల భావనను రెచ్చగొట్టి పరాయి వాళ్ళు పబ్బం గడుపుకున్న నేపధ్యం కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రతీ కులం గొప్పదే. ప్రతీ కులంలో ఎందరో మహానుభావులు ఉన్నారు అన్నది చరిత్ర చెప్పే అసలైన నిజం.
మొత్తానికి ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఏడాది లోపు ఉన్న నేపధ్యంలో కాపు కమ్మ రెడ్డి ఒక్కటే అంటూ ఆయన తెచ్చిన చారిత్రాత్మక సాక్ష్యం మీద వాడి వేడి చర్చ సాగుతోంది ముదిగొండ శివప్రసాద్ అన్నారని కాదు కానీ ఇప్పటికే ఎంతో కొంత విషయం తెలిసిన వారు కూడా తామంతా ఒక్కటేనని చాలా సార్లు ప్రకటనలు చేసిన సందర్భాలు ఉన్నాయి.ఏది ఏమైనా కులం కూడు పెట్టదు మానవ వికాసం కోసం ఏదైనా చేయాలి. అందువల్ల 2024లో కులాలను చూసి ఓట్లు వేయకుండా ప్రగతి కోసం ప్రజలు ఓటేస్తే ఈ తడవతో అయినా సంకుల రాజకీయ సమరం ఏపీ పొలిమేరలకు చేరుకుంటుందని అంతా ఆశిస్తున్నారు.






Very nice Sir. ANTHA MANVA KULAM MANA KULAM.