జనసముద్రం న్యూస్, మే 22:

వేసవి సెలవులు కావడంతో కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరు నగర పర్యటనకు వెళ్లిన ఏపీకి చెందిన యువ టెకీ అండర్పాస్ నీటిలో చిక్కుకుని అసువులు బాసింది. కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి భానురేఖ (22) బెంగళూరులో ప్రాణాలు కోల్పోయింది. ఆమె వెంట ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యులు కారు డ్రైవర్ను మాత్రం పోలీసులు ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారు.
ఏపీలోని కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన భానురేఖ బెంగళూరులోని ఇన్ఫోసి్సలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి అద్దె కారులో నగర పర్యటనకు బయల్దేరారు.కొద్దిసేపటికి నగరంలో కుండపోత వర్షం కురిసింది. శనివారం రాత్రి కూడా ఇదే తరహాలో వర్షం కురవడంతో చెట్లు నేలకూలి అండర్పాస్లు జలమయమయ్యాయి. ఈ క్రమంలో విధానసౌధకు సమీపంలోని కేఆర్ సర్కిల్ వద్ద భానురేఖ ప్రయాణిస్తున్న కారు అండర్పాస్ వద్ద లోతును గుర్తించకుండా లోనికి వెళ్లి నీటిలో చిక్కుకుపోయింది.సగానికిపైగా కారు నీటిలో మునిగింది. గమనించిన స్థానికులు సమీపంలోని డీజీపీ కార్యాలయానికి సమాచారమిచ్చారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఆరుగురిని రక్షించారు. అప్పటిక ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన భానురేఖ (22)ను మాత్రం సమీపంలోని సెయింట్ మార్థాస్ ఆస్పత్రిలో చేర్పించారు.
చికిత్స ఫలించక భానురేఖ మృతి చెందారు. సీఎం సిద్దరామయ్య.. మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కుటుంబసభ్యులందరి చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
కృష్ణాజిల్లాలో విషాదం కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన బత్తుల భానురేఖకు కొద్దిరోజుల క్రితం బెంగళూరులోని ఇన్ఫోసిస్లో ఉద్యోగం వచ్చింది. పదిరోజుల క్రితం ఆమె తేలప్రోలుకు వచ్చి కుటుంబసభ్యులను కూడా తీసుకెళ్లింది. ఆమె అన్నయ్య సందీ్పరెడ్డితోపాటు తల్లి స్వరూప అమ్మమ్మ శనగల సామ్రాజ్యం మేనమామ కుమార్తె సోహిత అమ్మమ్మ తమ్ముడు కుమార్తె సమితలతో కలసి ఆదివారం టాక్సీలో నగర పర్యటనకు వెళ్లారు.వర్షానికి విధాన సౌధకు సమీపంలో అండర్పా్సలోకి వర్షపు నీరు భారీగా చేరింది. ఈ మార్గంపై అవగాహన లేని డ్రైవర్ నేరుగా అండర్పాస్ కిందకు కారును తీసుకెళ్లాడు. దీంతో కారు నీటిలో మునిగిపోయి ఊపిరాడక భానురేఖ మరణించింది. దీంతో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.





