సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల నుండి కరెంటు సప్లై రాకుండా ఎవరైన… చేస్తూ
మీకు కనబడితే ఫోటోలు, వీడియోలు తీసి పంపగలరన్న వెంకటేశ్వర్లు…
డివిజనల్ ఇంజనీర్ అయితగోని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…
విద్యుత్ సంస్థలో వివిధ సబ్ స్టేషన్ ఆపరేటర్లు, కార్మికుల విభాగం లో… పనిచేస్తున్నటువంటి” హెచ్-82 ఆర్టిజన్స్ యూనియన్” వారు ఈ నెల ఏప్రిల్ 25వ తారీకు నుండి సమ్మెలో పాల్గొంటామని టీఎస్ ఎస్పీడీసీఎల్ మేనేజ్మెంట్ కి నోటీసు ఇవ్వడం జరిగింది..
మిర్యాలగూడ డివిజన్లలో ఉన్న మండలాలు అడవిదేవులపల్లి, దామరచర్ల, వేములపల్లి ,మాడుగులపల్లి, మిర్యాలగూడ రూరల్, మిర్యాలగూడ టౌన్ వన్, మిర్యాలగూడ టౌన్ టు, త్రిపురారం ,నిడమనూర్, హాలియా, పెద్దవూర, నాగార్జునసాగర్…
సంబంధించిన విద్యుత్ వినియోగదారులు…. అందరూ పై విషయాన్ని గమనించి విద్యుత్ సరఫరాలో ఏ విధమైన అంతరాయాలు ఉన్నచో అదే విధంగా ఎవరైన… ” వ్యక్తులు విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర, ఊర్లో ఉన్నటువంటి ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర మరియు విద్యుత్ లైన్ల దగ్గర ఏ విధమైన సమస్యలు సృష్టించే “కార్యక్రమాలకి పాల్పడిన ఎడల అంటే కృత్రిమంగా విద్యుత్ సరఫరా లేకుండా చేసి మేనేజ్మెంట్… ఒత్తిడి తీసుకురావాలని ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది. ఊర్లో ఉన్నటువంటి భాధ్యత కలిగిన వ్యక్తులు… మేము తెలుపబడిన సంఘటనలు జరిగే అవకాశం ఉన్నచోట” మీ ఫోన్లో ఫోటోలు తీస్తూ సంబంధిత కరెంటు డిపార్ట్మెంట్ అధికారులకు లేదా సంబంధిత పోలీస్” వారికి ఫోటోలు, వీడియోలు షేర్ చేయవలసిందిగా కోరడమైనది. ఈనెల 25వ తారీకు నుంచి ఆర్టిజన్ కార్మికుల పై ఎస్మా చట్టం అమల్లోకి వస్తుందని పై అధికారులు తెలియపరిచినారు.
సమ్మెకు వెళ్లేటటువంటి హెచ్-82 ఆర్టిజన్స్ సబ్ స్టేషన్ ఆపరేటర్లు వారి ప్లేస్ లలో స్పెషల్ గా డిపార్ట్మెంట్ వారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
పైవిషయం పురస్కరించుకొని మిర్యాలగూడ డివిజన్ మండలాల్లో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులు, వ్యాపారస్తులు , రైతులు డిపార్ట్మెంట్ కి సహకరించవలసిందిగా కోరారు.
తెలియజేస్తూ..
డివిజనల్ ఇంజనీర్, ఆపరేషన్, టి ఎస్ ఎస్పీడీసీఎల్ మిర్యాలగూడ… సెల్ నెంబర్ 9440813519.