
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 5 :
స్వాతంత్ర సమరయోధుడు, భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం జయంతి ఉత్సవాలు స్థానిక మిర్యాలగూడ షెడ్యూల్డ్ కులాల ఉద్యోగుల సంక్షేమ సంఘం డివిజన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…
విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా అధ్యక్షులు మారం శ్రీనివాస్, సంఘం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మాడుగుల శ్రీనివాస్, కొత్తపల్లి బాబురావు మాట్లాడుతూ…
బాబు జగ్జీవన్ రాం కేంద్ర మంత్రిగా, వివిధ శాఖలు …. పరిపాలించిన వ్యక్తిగా భారత ఉప ప్రధానిగా చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అవి గాయకులు రావిరాల అంజయ్య, ఒడిగ ఆమోస్, మిర్యాలగూడ పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు చేగుండి మురళి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు రమణాల పరశురాములు, సంఘం నాయకులు పేరపాక కృష్ణ, దైద వెంకటరత్నం, గుడిపాటి శ్రీరాములు, జెట్టి దాసు, మాలోతు హనుమ, పేరం దాసు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.





