అభ్యర్థులు నిబంధనలు పాటించాలి”: కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపీఎస్

Spread the love

పోలిస్ సబ్ ఇన్స్పెక్టర్ తుది రాతపరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 04

త్వరలో జరుగనున్న తెలంగాణ పోలిస్ రిక్రూట్మెంట్ సబ్-ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ కమిషనర్ శ్రీ డి.ఎస్ చౌహాన్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. నేరేడ్మెట్ లోని రాచకొండ కమీషనర్ కార్యాలయంలో పరీక్షా నిర్వాహకులు మరియు నోడల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

     ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 8, 9 తేదీల్లో సబ్ ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్షలు నిర్వహించడానికి తెలంగాణ పోలిస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించిందని, అభ్యర్థులకు హాల్ టికెట్ల జారీ ప్రక్రియ కూడా ప్రారంభం అయిందని తెలిపారు. పరీక్షా నిర్వహణ కేంద్రాలుగా ఎంపిక చేయబడ్డ కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళా అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇన్విజిలేటర్ లకు అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు నమోదు చేసే  విధానం మీద శిక్షణ ఇవ్వాలని సూచించారు. 

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్ష రోజున ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ప్రయాణ ఏర్పాట్లు సక్రమంగా చేసుకోవాలని సూచించారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని పరీక్షలకు హాజరు కావాలని తెలిపారు. అభ్యర్ధులు పరీక్షల్లో మంచి ఫలితం సాధించి పోలిసు శాఖలో చేరి ప్రజా సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ సత్యనారాయణ ఐపిఎస్, అదనపు డీసీపీ అడ్మిన్ నర్మద, అదనపు క్రైమ్ డీసీపీ శ్రీనివాస్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి