
ఇందిరమ్మ రాజ్యం లో ప్రజలందరికీ “న్యాయం” జరుగుతుందన్న కాంగ్రెస్ డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్..
జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 3 :
కాంగ్రెస్ హత్ సే హత్ జోడో యాత్రలొ భాగంగా… కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో.. దామరచర్ల మండలంలోని బెట్టే తండా నుండి గాంగ్య తండా, బొల్లిగుట్ట తండా , వాచ్య తండా , బొత్తలపాలెం గ్రామాల మీదుగా యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో..
యాత్రను ఉద్దేశించి శంకర్
నాయక్ మాట్లాడుతూ..
రాబోయే రోజుల్లో “ఇందిరమ్మ రాజ్యం “రాబోతుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికి …న్యాయం జరుగుతుందని, పోడుభూమి సమస్యని పరిష్కరిస్తామని, రూ 500 కి ప్రతి గడపకు..గ్యాస్ సిలిండర్ ను అందిస్తామని తెలిపారు. కౌల రైతులకు… 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, కిసాన్ సెల్ అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి బసవయ్య గౌడ్, లావూరి మంగుతా, లక్కీ సింగ్, రాంబాబు,ఆకారపు గోపాల్, కొమ్ము దాసు, సద్దాం,సిపాయి, రామయ్య వసంత్ నాగరాజు శివ నాయక్,ఆనంద్, శ్రీను, కోటేశ్వరరావు, మధు గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






