

ప్రభుత్వ భూములను కబ్జాలకు గురిఅవుతున్నాయని
మల్కాజ్గిరి సిపిఐ పార్టీ తెలియజేశారు.
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ తుపాకుల రమేష్ మార్చ్ 16
మల్కాజిగిరి సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసి బడా బాబులు కమర్షియల్ బిల్డింగ్ లు కడుతుంటే రెవెన్యూ అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారు. అదే పేద ప్రజలు గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే మాత్రం వాటిని కూలదోస్తుంటారు ఇది న్యాయమా అని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు పరిరక్షించాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమిలో డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మల్కాజిగిరి తాహిసిల్డార్ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 278, 222 లో ఉన్న ప్రభుత్వ భూముల్లో బడా బాబులు కబ్జాలు చేస్తున్నారు. వాటిని అధికారులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
