జనసముద్రం న్యూస్,మార్చ్ 16:
అనుకున్నట్లే జరిగింది. ఒక్కసారిగా వేల మంది అభ్యర్థుల కొంపముణిగింది. టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపెరీక్షను ప్రభుత్వం రద్దుచేసింది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది తొందరలోనే ప్రకటిస్తామని చెప్పింది. ఈమధ్యనే జరిగిన టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం లీకైన విషయం అందరికీ తెలిసిందే. బోర్డు సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్ ప్రలోభానికి గురై ఒక మహిళకు ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ప్రవీణ్ సదరు మహిళతో పాటు లీకేజీలో భాగస్వామ్యమున్న మరో తొమ్మిదిమందిని కూడా పోలీసులు అరెస్టుచేసి విచారిస్తున్నారు.
వీళ్ళ విచారణలో లీకైన ప్రశ్నపత్రం సుమారు 200 మందికి చేరినట్లు తెలిసింది. దాంతో ప్రవేశపరీక్షను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్నివేలమంది అభ్యర్ధులు ఈ పరీక్షను రాశారు. ఇదే విషయాన్ని ప్రకటించింది. ఈ దర్యాప్తులోనే మరికొన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. అవేమిటంటే గతంలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రవేశపరీక్ష పేపర్ కూడా లీకైందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. టీఎస్ పీఎస్సీ నిర్వహించిన అన్నీ పరీక్షల్లోను క్వశ్చన్ పేపర్లు లీకయ్యాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.ఈమధ్యనే నిర్వహించిన గ్రూప్ 1 ప్రవేశపరీక్షను సుమారు 30 వేలమంది రాశారు. పేపర్ లీకైందనే విషయం నిర్ధారణైతే అప్పటి పరీక్షను కూడా ప్రభుత్వం రద్దు చేస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దాంతో గ్రూప్ 1 ప్రవేశపరీక్ష రాసిన అభ్యర్ధులు టీఎస్ పీఎస్సీ ఆఫీసు దగ్గర పెద్దఎత్తున ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.
ఇపుడు బాగా వైరల్ అవుతున్న ప్రచారం ఏమింటటే 2015 నుండి ప్రభుత్వం నిర్వహించిన అనేక పరీక్షల పేపర్లు కూడా లీకయ్యాయని. మరిందులో ఎంతవరకు నిజముందో భగవంతుడికే తెలియాలి. దీంతోనే పరీక్షలు రాసిన వాళ్ళల్లోనే కాకుండా నిరుద్యోగుల్లో కూడా ఆందోళన బాగా పెరిగిపోతోంది. సరిగ్గా ఎన్నికల ముందు మొదలైన ఈ సమస్యను ప్రభుత్వం ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది ? ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుందనేది ఇపుడు ఆసక్తిగా మారింది. మరి చివరకు నిరుద్యోగుల జీవితాలు ఏమైపోతాయో ఏమో.