మనువాద,పాసిజానికి వ్యతిరేకంగా పోరాడితేనే మహిళలపై హింస నివారణ

Spread the love

ఏఐఫ్ డి డబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (మార్చ్ 08)

మహిళలపై జరుగుతున్న దాడులను, హింసను నివారించాలంటే మనువాద పాసియానికి వ్యతిరేకంగా పోరాడితేనే నివారించగలమని ఏఐఎఫ్డి డబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 నుండి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా మనువాద-ఫాసిజానికి వ్యతిరేకంగా మహిళలు పోరాడాలి” అనే అంశం పైన శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ స్టాలిన్ నగర్ లోజరిగిన కార్యక్రమాని ముఖ్యఅతిథిగా హాజరై ఏఐఎఫ్ డిడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య మాట్లాడుతూ మానవ సమాజ మొత్తం చరిత్రలో భారత తాత్విక అంశంలో బ్రాహ్మణిజం మహిళను వంటింటి కుందేలుగాను, ఎలాంటి హక్కులకు నోస్కొని విధంగా పురుషునికి సేవ చేసే బానిసగా చేసి పెట్టిందని, బ్రాహ్మణిజం చెప్పే మనువాద శాస్త్రం మానవ హక్కులను కాలరాయడమే కాకుండా స్త్రీ పురుషుల మధ్య సమానత్వం లేని గీతలు గీసిందని దీని ద్వారా పురుషుడు స్త్రీపై నాటి నుంచి నేటి వరకు ఒక వివక్షతను ప్రదర్శిస్తూ హింసకు పాల్పడుతున్నాడని ఇది మనువాద ధర్మమని చెప్పడం జరుగుతుంది వందల సంవత్సరాలుగా ఇప్పటికీ స్త్రీ హింసకు,అత్యాచారాలకు, హత్యలకు గురి అవుతూ వస్తున్నదని ఆరోపించారు.

బ్రిటిష్ కాలంలో ఆ తర్వాత స్వాతంత్ర అనంతరం మహిళల పై అనేక చట్టాలు వచ్చినప్పటికీ ఆ చట్టాలు పేద మధ్యతరగతి మహిళలకు న్యాయం చేయట్లేదని అన్నారు. ఓ పక్క మనువాద విధానంతో స్త్రీ నలిగిపోతుంటే మరోపక్క పాలకుల మతోన్మాద పాసిజానికి స్త్రీ సమాజానికి దూరం చేయడమే కాకుండా మనుషులలో సగభాగమున్న వారికి ఆర్థిక రాజకీయ స్వాతంత్రా సమానత్వం సిద్ధించబడతలేవని ఆరోపించారు. చట్టసభలలో 33% కూడా రిజర్వేషన్లు లేవని వాటి గురించి అనేక పోరాటాలు చేస్తుంటే సమానత్వం చాటలేని రాజకీయ పార్టీలు స్త్రీకి స్వేచ్ఛ హక్కులను దూరం చేయడమే కాకుండా వివక్షతను చూపిస్తూ హింసను వివక్షతను ప్రోత్సహిస్తూ వస్తున్నారని అన్నారు. పాలకుల ఆర్థిక రాజకీయ అసమానతులకు వ్యతిరేకంగానే పోరాడుతూ సామాజిక సమానత్వ కోసం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోరాడాలని పిలుపునిచ్చారు
పి.భాగ్యమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డిడబ్ల్యు రాష్ట్ర కోశాధికారి తాండ్ర కళావతి, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అంగడి పుష్ప,గ్రేటర్ హైదరాబాద్ నాయకురాలు బి విమల, టి పుష్పలత, బి రాణి, అనిత, ధారా లక్ష్మి,జయలక్ష్మి, విజయ, ఏఐఎఫ్ డి వై గ్రేటర్ హైదరాబాద్ యువతల విభాగం కన్వీనర్ ఎండి సుల్తానా, జి శివాని, రాజశ్రీ,మరియు వి.తుకారం నాయక్,తుడుం అనిల్ కుమార్ లు మాట్లాడినారు.కర్ర దానయ్య,కన్న శ్రీనివాస్,పల్లె మురళి, లలిత, టీ.నర్సింగ్, ఏ దుర్గాప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి