మనం నేలస్థ జాతులం కాదు, ఆత్మగౌరవంతో బ్రతికేవాళ్లం: బృందాకరత్

Spread the love

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 2 :

మనం నేలస్థ జాతులం కాదని ఆత్మగౌరవంతో బ్రతికే వాళ్ళమని ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ బృందాకరత్ మిర్యాలగూడ పట్టణంలోని ఏ ఆర్ సి ఫంక్షన్ హాల్ లో జరిగిన రాష్ట్ర గిరిజన సంఘం మూడు రోజుల సమావేశంలోరెండవ రోజు ఈరోజున సభలో మాట్లాడటం జరిగింది. ఇంతే కాకుండా గిరిజనులు, లంబాడీలకు జరుగు అన్యాయం గురించి మాట్లాడుతూ..
సమాజం,చరిత్ర, అస్తిత్వం సంస్కృతిని కాపాడుకునేందుకు గిరిజనులు, లంబాడీలు బలమైన ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గిరిజన సమాజం అస్తిత్వం, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను కనుమరుగు చేసేందుకు బిజెపి, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఆల్ ఇండియా స్థాయిలో హిందుత్వాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని దానిని గిరిజనులు, లంబాడీలు గ్రహించి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. తండాలను పంచాయతీ సంఘంలో నివేదించే చట్టం తీసుకురావాలని తెలిపారు. కొన్ని రాష్ట్రాలలోగిరిజనులు, లంబాడీలు ఎస్సీ, ఎస్టీ జాబితాలో ఉన్నారని మరికొన్ని రాష్ట్రాలలో ఓబీసీ జాబితాలో ఉన్నారని తెలపడం జరిగింది. లంబాడీలకు ప్రత్యేకంగా మతం ఉన్నప్పటికీ హిందూ మతం అనే విధంగా బిజెపి ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ రాజకీయం చేస్తుందని దానిలో భాగంగా గిరిజనులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. బ్రిటిష్ కాలంలో గిరిజనులను షెడ్యూల్, నాన్ షెడ్యూల్ ప్రాంతాలలో నివసించే గిరిజనులు, లంబాడీలు పట్ల తెలంగాణ ప్రభుత్వం ఉద్యమాలు చేస్తుందని షెడ్యూల్డ్ ప్రాంతాలలో..జీవించే గిరిజనులు..కోసం ఉద్యమాలు చేయాలని సూచించారు. అటవీ హక్కుల చట్టం అమలు కోసం,,పోడు భూముల సాధన కోసం మరింత బలమైన ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మరలా వచ్చే బహిరంగసభలోపు లక్ష మంది సభ్యత్వం తీసుకొని ఉండాలని తెలిపారు.అధ్యయనం పోరాటం, త్యాగాలు, సంఘాలు వలన గిరిజనలు, లంబాడీలు అభివృద్ధి చెందుతారని అన్నారు. రాష్ట్రంలో గిరిజనులు..,కోసం “తెలంగాణ గిరిజన సంఘం” బలమైన శక్తి గా ఎదగాలని సూచించారు.గిరిజనులు.., మంచి విద్య కొనసాగించాలని తెలిపారు. కరోన సమయంలో గిరిజనులు, లంబాడీలు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపి ఈ సభలో ఇంకా మరెన్నో విషయాలు మాట్లాడి “తెలంగాణ గిరిజన సంఘం జిందాబాద్” అని బృందాకరత్ తెలిపి సమావేశాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు కర్ణాటక రాష్ట్ర బాధ్యులు గురు శాంత్, తెలంగాణ ద్వితీయ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం ధర్మానాయక్, కర్ణాటక గిరిజన నాయకులు బాలు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి నాయక్, సహాయక కార్యదర్శి భూక్య వీరభద్రం, వీరన్న వెంకన్న సాహెబ్, కె.,శంకర్, ఎం. రవి నాయక్, బి విజయబాబు, ఎం.శంకర్, ఏపీ గజల్ నాయకులు..నరసింహ నాయక్,లక్ష్మణ్ నాయక్, గణేష్ నాయక్.. లు,సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నారి ఐల య్య, ఏవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్, వెంకట్, రాములు, పరశురాములు సిపిఎం, సిఐటియు నాయకులు, పలు సంఘాల నాయకులు, తండాల ప్రజలు, ఆదివాసి రాష్ట్రీయ మంచ్ నాయకులు , సిపిఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి