
జనసముద్రం న్యూస్, రంగారెడ్డి జిల్లా (ఫిబ్రవరి 15)
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రంగారెడ్డి జిల్లా 2023 డైరీని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా యూనియన్ నాయకులతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్, ప్రధాన కార్యదర్శి గాధం రమేష్, కోశాధికారి పి. వెంకటేష్, జాతీయ నాయకులు ఉప్పు సత్యనారాయణ, బిరుదు చందర్, రాష్ట్ర నాయకులు విట్టల్ రెడ్డి, మరియు జిల్లా కమిటీ సభ్యులు తగారం సత్యనారాయణ, హరికృష్ణ, శ్రీనివాస్, రాఘవేందర్, సాయి, కృష్ణ, జంగయ్య, రాజేంద్ర నగర్, మహేశ్వరం, షాద్ నగర్, చేవెళ్ల, ఎల్ బి నగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల యూనియన్ నాయకులు, జర్నలిస్ట్ లు పాల్గొన్నారు





