
రాష్ట్ర నాయకులు- చంద్రశేఖర్ ముదిరాజ్
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 15
మనోహరాబాద్ త్వరలో గ్రామ పంచాయతి భావన నిర్మాణం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు భాషబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ తెలిపారు. బుధవారం రోజున కొనాయిపల్లి గ్రామంలో నిర్మాణం లో ఉన్న పంచాయతి భావన నిర్మాణ పనులను పంచాయతి రాజ్ డిఈ నర్సింలు తో కలిసి అయన పరిశీలించారు. అన్ని హంగులతో గ్రామ పంచాయతి భవన నిర్మాణం చేపట్టామని త్వరలో పంచాయతీ భవనాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు,





