జనసముద్రం న్యూస్,ఫిబ్రవరి 09:
వారితో ఎన్నికల సమయంలో పెద్ద పనే ఉంటుంది. పైగా.. పుణ్యపురుషులు ఎన్నికల టైంలో పోలింగ్ బూత్ వరకు వస్తారో రారో ఎవరూ చెప్పలేరు. కానీ మద్యం ప్రియులైన మహాపురుషులు మాత్రం చుక్క కోసమైనా బటన్ నొక్కేందుకు రెడీ అంటారు.మరి వీరిని కాకాపట్టాలంటే ఎలా? ఇప్పుడు అసలు వారి ‘మూడ్’ ఎలా ఉంది? అంటే.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పిచ్చిపిచ్చి బ్రాండ్స్తో తిక్కతిక్కగా ఉంది. దీనికి తోడు 150 ఉంటే తప్ప.. నాలిక తడవని పరిస్థితి!!
దీంతో ఈ మహాపురుషులు అందరూ కూడా విధిలేక.. నాలుక పీకులాటను తట్టుకోలేక.. ఆ పిచ్చి బ్రాండునే తిట్టుకుంటూ.. కొనుక్కోవడం.. తాగాక దిగేవరకు తిట్టుకోవడం.. అనే పద్ధితిలో కాలం గడిపేస్తున్నారు. మరి ఎంతైనా.. అన్ని కోణాల్లోనూ సర్వే చేయిస్తున్న ప్రభుత్వం ఈ విషయంపైనా దృష్టి పెట్టింది. దీంతో తిట్టుకుంటూ.. తాగుతున్నవారితో పెద్ద డేంజర్ ఉందని గ్రహించిందో ఏమో.. వెంటనే ఓల్డ్బ్రాండ్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.దీంతో.. పేద పురుషులు తాగే.. ఒరిజినల్ ఛాయిస్ నుంచి దిగువ మధ్యతరగతి రుచి చూసే మెక్ డోల్ విస్కీ వరకు.. ఎగువ మధ్యతరగతి సేవించే ఆఫీసర్స్ ఛాయిస్ నుంచి రాయల్ స్టాగ్ వగైరా వగైరా బ్రాండ్లను త్వరలోనే తీసుకురానున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా.. ఇది పెద్ద వ్యూహంగానే ఉంది. అయితే.. ఇక్కడే అసలు సిసలు సమస్య ఉంది.ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చెబుతున్న జగన్ బ్రాండ్స్ను తయారు చేస్తోంది.. అధికార పార్టీ వారే. మరి వారు ఈ అసలు సిసలు బ్రాండ్స్ను తెస్తే.. ఒప్పుకుంటారోలేదో చూడాలి. ఎంతైనా ఎన్నికలు కదా.. ఎవరి ఆదాయం పోయినా ఇబ్బందే. మరి దీనిని సమతూకం చేసేందుకు ఎలాంటి మంత్రం పాటిస్తారో వేచి చూడాల్సిందే.
ఎన్నికలకు సమయం ముంచుకు వస్తుండడంతో ఏపీలో వైసీపీ ప్రభుత్వం దానికిఅనుగుణంగా నిర్ణయా లు తీసుకుంటోంది. ఇప్పటి వరకు మహిళలను సెంట్రిక్గా చేసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పురుష ఓటర్లను ఆకట్టుకునే పనిని ప్రారంభించినట్టు తెలుస్తోంది. పురుషులందు పుణ్యపురుషుల మాదిరిగానే మద్యం ప్రియులైన పురుషులు కూడా వేరేగా ఉంటారు కదా!