
రాచకొండ సీ.పీ డిఎస్ చౌహాన్ ఐ పి ఎస్
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి 08
నేడు, రేపు మౌలాలిలో హజరత్ అలీ జన్మదినం పురస్కరించుకుని ఉర్సు ఉత్సవాలు మరియు ఇతర మతపరమైన కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐ పి ఎస్., మౌలాలిలో పర్యటించి పోలీసు అధికారులకు బందోబస్తు మీద సూచనలు సలహాలు ఇచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీపీ వెంట ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ మహంతి ఐ పి ఎస్., మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి ఐ పి ఎస్, ఏ సి పి మల్కాజిగిరి నరేష్ రెడ్డి, మల్కాజ్ గిరి ఇన్స్పెక్టర్ జగదీష్ ఉన్నారు.






