ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై అధికారులకు తక్షణమే స్పందించాలి….

Spread the love
  • పెండింగ్లో ఉన్న 359 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలి….
  • మెదక్ కలెక్టర్ రాజర్షి షా…

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 6

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి ప్రజావాణి పోర్టల్ లో అప్ డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల నుండి అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్ లతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్ణయాధికారాలు తీసుకునే జిల్లా అధికారులే తప్పని సరిగా ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని, అత్యవసరమైతే ముందస్తుగా అనుమతి పొంది తరువాత స్థాయి (నెక్స్ట్ లెవెల్ ) అధికారిని పంపాలని సూచించారు. ఇప్పటి వరకు వివిధ శాఖలలో పెండింగులో ఉన్న 359 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టి వచ్చే ప్రజావాణి కార్యక్రమం నాటికి పరిష్కరించాలని ఆదేశించారు.


ఫిర్యాదీదారులతో క్రిక్కిరిసిన ప్రజావాణిలో కలెక్టర్ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ ఫిర్యాదీదారుల సమస్యలు సావధానంగా ఆలకించి, ఆప్యాయంగా పలుకరిస్తూ తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ధీమా కల్పించారు. ప్రతి ఫిర్యాదీదారుడు ముందుగా కంప్యూటర్ లో నెంబర్ జెనరేట్ చేసుకున్న తరువాతే ఫిర్యాదులు పరిశీలించారు. 60 దరఖాస్తులు రాగా అందులో ప్రధానంగా భూ సమస్యలు, ధరణి, రెండు పడకల ఇళ్ళు , ఆసరా పింఛన్లు, ఆర్థిక సహాయం, మూడు చక్రాల సైకిళ్ళు, తదితర వాటికి సంబంధినవి ఉన్నాయి. అలాగే అర్హులైన మైనారిటీలకు ఋణం మంజూరు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, దేవాలయానికి ఇచ్చిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని విజ్ఞప్తులు వచ్చాయి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదీదారుల సమస్యలను పరిశీలించి పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించే వాటికి కారణాలు తెలపాలని, పరిష్కార మార్గాలు చూపాలన్నారు. సదరం క్యాంపులో 40 శాతం పైగా వికలాంగత్వం ఉన్నట్లు ధ్రువపత్రం ఇస్తేనే వికలాంగుల పింఛనుకు అర్హులని, తిరస్కరణకు గురైన పింఛను మంజూరు దరఖాస్తును తిరిగి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు పాత ఐ.డి. ని రద్దు చేస్తూ కొత్త ఐ.డి. కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించవలసినదిగా డిఆర్ డిఓ కు సూచించారు. రేపటి నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దరఖాస్తులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయవలసినదిగా ఏ.ఓ.యూనుస్ కు సూచించారు.
ఆస్తి తగాదాలకు సంబంధించి భూ సమస్యల పరిష్కారానికి కోర్టును ఆశ్రయించవలసినదిగా ఫిర్యాదీదారులకు సూచించారు. తమ సమస్యలతో పాటు నలుగురికి ఉపయోగపడే సామాజిక సమస్యలు ప్రజావాణి దృష్టికి తేవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు శైలేష్, జయరాజ్, కమలాకర్, శ్రీనివాస్ రావు, శ్రీనివాస్, కేశూరం, ఆశా కుమారి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి