మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది

Spread the love
  • కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి…
  • మీపై ఆధారపడ్డ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి…..
  • మెదక్ కలెక్టర్ రాజర్షి షా….

మెదక్ జిల్లా, ప్రతినిధి (జనసముద్రం న్యూస్) ఫిబ్రవరి: 6

మీ భవిష్యత్తు కోసం, తల్లిదండ్రుల కోసం, మీ పై ఆధారపడ్డ వారి కోసం ఉన్నత ఉద్యోగ సాధనే లక్ష్యం కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హితవు చెప్పారు. టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ 2,3,4 ఉద్యోగాలకు ఎస్సి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మూడు మాసాల పాటు ఎస్సి అభ్యర్థులకు ఇచ్చే ఉచిత శిక్షణ ఫౌండేషన్ ప్రారంభించిన అనంతరం జ్యోతిని వెలిగించి, అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జులై లో జరిగే పోటీ పరీక్షలకు సమయం తక్కువగా ఉన్నందున టి.వి. సినిమా, చరవాణిలకు దూరంగా ఉండి ఈ నాలుగున్నర మాసాలు కష్టపడి చదవాలి.. చదువుతూనే ఉండాలని అన్నారు. ముందుగా సిలబస్ ఏముందో చూసుకొని, ఎలా చదవాలో మదిలో ఒక అవగాహనకు రావాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతామన్నారు.ఉన్నత ఉద్యోగమే లక్ష్య సాధనగా అభిరుచి, కోరిక మేరకు స్టడీ సర్కిల్ ఇచ్చే మెటీరియల్ తో పాటు ఆన్ లైన్ ద్వారా వివిధ పుస్తకాలను అధ్యయనం చేయాలని, చదువుతో పాటు క్లుప్తంగా నోట్స్ సిద్ధం చేసుకోవాలని, కంబైన్డ్ స్టడీ చేయాలని సూచించారు. మెంటల్ అబిలిటీ , కరంట్ అవైర్స్ పై అవగాహన పెంపొందించుకోవాలని, గత పి ఎస్ సి పరీక్షల పేపర్లను తిరగేసి క్వక్షన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందొ అర్థం చేసుకోవాలని అన్నారు. నిష్ణాతులైన ఫ్యాకల్టీ చే వంద మంది అభ్యర్థులకు మూడు మాసాల పాటు శిక్షణతో పాటు 1500 రూపాయల విలువ గల స్టడీ మెటీరియల్ ఇస్తూ ఒక్కో అభ్యర్థికి 6,750 ల చొప్పున ప్రభుత్వం స్టైపండ్ ఇస్తుందని, ఇట్టి చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ప్రోగ్రాం డైరెక్టర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి