
జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజె, ఫిబ్రవరి 1 :
మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామర చర్ల మండల కేంద్రంలో ని లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్ లో ఎస్ఎఫ్ఐ నల్లగోండ జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతుల లో మూడవ రోజు శిక్షణ తరగతుల కార్యక్రమం ఎస్ఎఫ్ఐ, సిఐటియు నాయకులు మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి జూలకంటి రంగారెడ్డి హాజరు అయ్యారు
సిపిఎం మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగన్న ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ..
ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంపై ఆగడాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయిందని జూలకంటి రంగారెడ్డి తెలిపారు.దేశంలో బిజెపి తీసుకువస్తున్న నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ బలమైన శక్తి గా ఎదగాలని జూలకంటి పిలుపునిచ్చారు.దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో వున్న ఇవాళ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని యూనివర్సిటీ లో “విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క” ఎస్ఎఫ్ఐ విజయకేతనం ఎగర వేస్తుందంటే కారణం నిత్యం విద్యా రంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ సమరశీల పోరాటాలు చేయడం వల్లనే అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఇప్పటిదాకా నెగ్గింది లేదని, చరిత్రను పాలకులు మరిచి పోవద్దని అన్నారు.రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రం లో విద్యారంగానికి 30శాతం నిదులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలు అన్ని విద్యా సంస్థలు లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలనిరంగారెడ్డి కోరారు.బంగారు తెలంగాణ రాష్ట్రంలో బంగారు భవిష్యత్ కలిగిన విద్యార్థులు సరైన బాటలో నడావాలంటే ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు .పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం బకాయిలో వున్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ విడుదలను జ్యాపం చేయకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని పేధ మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేయాలని జూల కంటి రంగన్న డిమాండ్ చేయడం జరిగింది.ఈ దేశంలో రాష్ట్రం లో “భారత విద్యార్థి ఫెడరేషన్ ” బలమైన విద్యార్థి సంఘం గా ఎదగడం కోసం ఈ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతాయని రంగన్న ఈ సమావేశంలో తెలిపారు

ఈకార్యక్రమం లో డివైఎఫ్ఐ రాష్ట్రఅధ్యక్షడు కోట రమేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వేంకటేశ్వర్లు, డివైఎఫ్ఐ దామరచర్ల మండల కార్యదర్శి వినోద్ నాయక్,గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు పాప నాయక్, సిఐటియు మండల కార్యదర్శి దయానంద్, కోటి రెడ్డి ఎస్ఎఫ్ఐ మాజి రాష్ట్ర కమిటీ సభ్యులు థీరవత్ శ్రీను నాయక్, ఎస్ఎఫ్ఐ నల్లగోండ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్,మిర్యాలగూడ డివిజన్ కార్యదర్శి కోర్ర సైదా నాయక్, పట్టణ అధ్యక్షా కార్యదర్శులు వదుద్ జగన్ నాయక్, వీరన్న, సూర్య, రమేష్,ఉపేందర్ , ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు, సిఐటియు నాయకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





