
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ అర్బన్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 1 :
మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో మున్సిపాలిటీ మరియు మండల మినీ అంగన్వాడీ టీచర్,అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు చేతుల మీదుగా, మిర్యాలగూడ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్.మమత ఆధ్వర్యంలో..కొత్తగా ఐసిడిఎస్ కార్యాలయంలో కొత్తగా నియమించబడిన మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు 6 గురు ఆయాలకు "ఐసీడీఎస్ కార్యాలయం" కు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.
ఐసిడిఎస్ కార్యాలయం కు కొత్తగా నియామకం అయిన ఉద్యోగుల వివరాలు..

మండల పరిధిలో కొత్త కాలనీ మినీ అంగన్వాడీ టీచర్ గా బి.శంకరమ్మ , ఆలగడప -3 హెల్పర్ పోస్ట్ కి ప్రద్యుమ్న , హత్యతండా హెల్పర్ గా డి .సంతోష , ఊట్లపల్లి - 2 హెల్పర్ గా బి.శోభారాణి.
మరియు మున్సిపాలిటీ పరిధిలో 26 వ వార్డు లో శాంతినగర్ 2-1 లో హెల్పర్ గా రేష్మా బేగం ,40 వ వార్డ్ శాంతినగర్ - 3 లో యు .పావని, తాళ్లగడ్డ -1 లో హెల్పర్ గా ఎండి.షబానా.. లు "ఐసిడిఎస్ కార్యాలయం"కు ఉద్యోగ రీత్యా నియమించడం జరిగింది.
వీరందరికీ ఐ సి డి సి కార్యాలయం కు నియామక పత్రాలు మిర్యాలగూడ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కర రావు చేతుల మీదుగా వీరికి' సిడిపిఓ' అధికారి మమత ఇప్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిడిపిఓ అధికారి మమతతో పాటు ఐసిడిఎస్ సూపర్వైజర్ లు.. సిహెచ్.పద్మ,,పి .రేవతి,ఎన్ .మాధవి,ఎస్ రాధిక,యం. లీలాకుమారి, తదితర ఐసిడిఎస్ అధికారులు పాల్గొనడం జరిగింది.





