కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిస్తే ఊరుకొం : జూలకంటి రంగారెడ్డి

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 1:

మిర్యాలగూడ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో బుధవారం రోజున సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో” బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్” బడి సమావేశం జరిగింది.

సిఐటియు కార్యాలయంలో జూలకంటి రంగన్న మాట్లాడుతూ..

800 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో 160 కోట్ల పైగా జనాభా ఉన్న దేశాలలో ‘కమ్యూనిస్టు ప్రభుత్వాలు’ పాలన సాగిస్తున్నాయని అన్నారు. ఇతర దేశాలలో ప్రతి కుటుంబానికి ఉండటానికి గృహాలు, జీవనోపాధి, ఉచిత విద్య, వైద్యం అందించబడుతుందని వీటివలనే ఇతర దేశాలు అభివృద్ధి చెందాయని ‘రంగన్న’ తెలిపారు. వ్యక్తిగత సంక్షేమాలు కాకుండా, విధానపరమైన సంక్షేమాలు అమలు చేయడం వల్ల దేశం అభివృద్ధి చెందటం తో పాటు ప్రజలు అభివృద్ధి చెందుతారని తెలిపారు. ఈ దేశంలో ప్రభుత్వ సంపదను, ఆస్తులను దోచుకునే పద్ధతిలో పాలకులు అవలంబిస్తున్నారని జూలకంటి రంగన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. కేంద్రంలో పరిపాలన చేస్తున్న బిజెపి ప్రభుత్వం ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మతం, ఒకే నాయకుడు ఉండే విధానాన్ని అమలు చేస్తున్నాదని జూలకంటి ఆరోపించారు. వేలాది కోట్ల రూపాయలు.. బ్యాంకులకు ఎగగొట్టిన కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం రైతులకు ఏమి కల్పిస్తుందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుందని కార్మికులు, రైతులు సంఘటితంగా ఉద్యమించాలని “జూలకంటి రంగన్న ” పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిస్తే ఊరుకోబోమని, కార్మికులు బలమైన ఉద్యమాలు చేసి ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. నిస్వార్థంగా సేవలు అందించే ప్రజాప్రతినిధులు కార్పొరేట్ రాజకీయ నాయకులుగా మారారని, ఓటర్లు నిస్వార్ధంగా ఆలోచించి “ప్రజాసేవ ” నాయకులను ఎన్నుకోవాలని కోరారు. కార్మికులు, పేదలందరికీ డబుల్ బెడ్ ఇండ్లు,రేషన్ కార్డులు,పెన్షన్లు అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీరెట్లు పెంచాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచుకునేందుకు కార్మికులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జూలకంటి గుర్తింపు కార్డులు, సభ్యత్వాలు సిఐటియులో చేరే కార్మికులందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగన్న తో పాటు సిఐటియు జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్, భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా నాయకులు బిఎం నాయుడు, సిఐటియు పట్టణ కన్వీనర్ తిరుపతి రామ్మూర్తి, రైతు సంఘం నాయకులు రాగిరెడ్డి మంగా రెడ్డి, నాయకులు పాపి రెడ్డి, యూనియన్ అధ్యక్షులు మంద రాజు, కార్యదర్శి సైదులు నాయక్, అలీమ్, నాగుల్ మీరా, పాశం గోవర్ధన్ రెడ్డి,బుజ్జి బాబు, అంకెపాక నాగరాజు, సయ్యద్ హైమద్, నగేష్, గౌస్, సోముసుందర్, ఉట్లపల్లి సైదులు, కొటేష్ సిపిఎం,సిఐటియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!