ఉపాధి హామీ పనులు ముమ్మరం చేయాలి…..

Spread the love
  • ప్రతి గ్రామ పంచాయతీలో 50 మందికి కూలీలకు ఉపాధి కల్పించాలి…..
  • పంచాయతీ కార్యదర్శులు ఏపీఎంలు కూలీలకు అందుబాటులో ఉండాలి…..

మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్….

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి: 31

ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టవలసినదిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మండల పరిషద్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఉపాధి హామీ పధకం, పంచాయత్ అవార్డులు, మైనారిటీలకు యూనిట్ల మంజూరు అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో 50 మందికి తగ్గకుండా కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని, ఆ దిశగా గ్రామాలలో వివిధ పనులను గుర్తించి ముమ్మరంగా చేపట్టవలసినదిగా సూచించారు. బుధవారం నుండే కూలీలకు పనులు కల్పించుటకు పంచాయతీ కార్యదర్శులు, ఏ.పి.ఏం.లు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ఇంతవరకు 270 తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని, మిగతా ప్రాంతాల్లో కూడా స్థలాలలను ఎంపిక చేసి వెంటనే వాటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
పంచాయత్ అవార్డులను సమీక్షిస్తూ ఆదర్శమైన గ్రామ పంచాయతీ అంటే 9 (థీమ్ ) అంశాలలో సుస్థిర అభివృద్ధి సాధించి ఉండాలని, అట్టి వాటికి కేంద్ర ప్రభుత్వం పంచాయత్ రాజ్ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 24, 2024 న జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డులు ప్రధానం చేస్తుందని అన్నారు. 9 థీమ్ లు ఇలా పేదరికంలేని మెరుగైన జీవనోపాధి గ్రామం, ఆరోగ్యవంతమైన, చైల్డ్ ఫ్రెండ్లీ , నీరు సమృద్ధిగా ఉన్న గ్రామం, పచ్చదనం,పరిశుభ్రత, స్వయం సమృద్ధితో అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన గ్రామం, సామాజికంగా సురక్షితమైన గ్రామం, గుడ్ గవర్నెన్స్, మహిళా స్నేహ పూర్వక గ్రామం. ఇలా ఒక్కో థీమ్ లో సుస్థిర లక్ష్యాలు సాధించిన 3 గ్రామా పంచాయతీల చొప్పున 27 గ్రామా పంచాయతీలను ఎంపిక చేసి పంచాయత్ అవార్డుల ఎంపికకు ఎంట్రీ లు పంపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుండి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి షార్ట్ లిస్ట్ రూపొందించి పోర్టల్ లో అప్ లోడ్ చేస్తున్నామన్నారు .
మైనార్టీ వర్గాలకు యూనిట్ల మంజూరు గురించి సమీక్షిస్తూ 80 శాతం సబ్సిడీతో లక్ష రూపాయల లోపు 39 యూనిట్ల మంజూరు, 70 శాతం సబ్సిడీతో రెండు లక్షల లోపు 17 యూనిట్ల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానించగా నాలుగు మునిసిపాలిటీలు, 20 మండలాల నుండి 2,239 దరఖాస్తులు వచ్చాయని, వాటిని ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారుల జాబితా రూపొందిస్తున్నామని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషద్ సీఈఓ శైలేష్, డిఆర్ డిఓ శ్రీనివాస్, డిపిఓ సాయిబాబ, మైనారిటీ అధికారి జెంలా నాయక్, మునిసిపల్ కమీషనర్లు జానకిరామ్ సాగర్, మోహన్, వెంకట గోపాల్ , మండల పరిషద్ అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!