గ్రామపంచాయతీలు, సీసీ రోడ్ల నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేసిన నల్లమోతు భాస్కర్ రావు..

Spread the love

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 31:

మిర్యాలగూడ మండలములో “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం” గ్రాంట్ ద్వారా 20 గ్రామాలకు మంజూరైన 3కోట్ల 80 లక్షల నిధులతో గ్రామాలైన వెంకటాద్రిపాలెం, జంకు తండా, లావుడి తండా, అవంతిపురం గ్రామాల నందు నూతన గ్రామ పంచాయతీ భవనాలు. యాద్గార్ పల్లి, తడకమళ్ళ, తక్కెళ్ళపహాడ్, తక్కెళ్ళపహాడ్ తండా, ఉట్లపల్లి, తుంగ పహాడ్, వాటర్ ట్యాంక్ తండా, ఆలగడప, అన్నారం, భగ్య గోపసముద్రం తండా, కొత్తగూడెం, కొత్తపేట, లక్ష్మి పురం, రాయినిపాలెం, రుద్రారం, జప్తివీరప్ప గూడెం గ్రామాల నందు నూతన సి.సి రోడ్ల నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి తో కలిసి మిర్యాలగూడ నియోజవర్గ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు.

శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ..

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు, రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తున్నారని భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గం లో ప్రతి గ్రామం అభివృద్ధి గ్రామంగా మారుతుందని భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి నేను ఎంతో కృషి చేస్తున్నానని, ఇంకా మరెన్నో విషయాలు భాస్కర్ రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వీరితోపాటు నల్గొండ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మిర్యాలగూడ మండల ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి, పాక్స్ చైర్మన్ వేలిశెట్టి రామకృష్ణ, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, మాజీ మార్కెట్ కమిటి డైరెక్టర్ పులి జగదీష్, మాజీ ఎంపీపీ ఓగ్గు జానయ్య, పంచాయతీ రాజ్ శాఖ డి ఈ వెంకటేశ్వర్ రావు, ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, మిర్యాలగూడ మండల పార్టి ప్రధాన కార్యదర్శి పిస్కే ప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎం.పీ.టీ.సీ లు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, గ్రామ పార్టీ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి