
జనసముద్రం న్యూస్ :24/01/23
కులకచర్ల మండలం బండ వెల్కిచర్ల గ్రామ పరిధిలో ఆశ్రమ పాఠశాలలో బాలికల దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్వో రమేష్ గారు విచ్చేసి పిల్లలకు బాలికలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు వారికి ఉన్నటువంటి హక్కులను సద్వినియోగపరుచుకోవాలి చదువుకునే హక్కు ఆడుకునే హక్కు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి దేశ ప్రగతికి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అమ్మాయిలు అన్ని రంగాలలో విజేతలుగా నిలిచి బావి భారత పౌరులుగా మెలగాలని తెలియజేయడం జరిగింది. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వరలక్ష్మి ఉపాధ్యాయ బృందం మ్యాజిక్ బస్ నర్సింలు గౌడ్ పి ఎన్ పి ఎస్ వ్యవస్థాపకులు రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో తమ యొక్క బృందం పాల్గొనడం జరిగింది.





