కుందూరు వరలక్ష్మి వర్ధంతిని పురస్కరించు కొని వీర కోటిరెడ్డి పర్యవేక్షణలో ముగ్గుల పోటీలు

Spread the love

జనసముద్రం న్యూస్, దామరచర్ల, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 13:

మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండల కేంద్రం లో ప్రభుత్వ పాఠశాలలోకుందూరు వరలక్ష్మి “3 వ వర్ధంతి” ని పురస్కరించుకొని మండల కేంద్రం నందు ప్రభుత్వ పాఠశాలలో అం గ రంగ వైభవంగా ” ముగ్గుల పోటీలు” నిర్వహించారు. ముగ్గుల పోటీ కార్యక్రమమును నల్గొండ జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు కుందూరు వీర కోటిరెడ్డి పర్యవేక్షించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని “ముగ్గుల పోటీల “విజేతలకు బహుమతులను అందజేసారు.

మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ..

దామరచర్ల మాజీ సర్పంచ్ కుందూరు వరలక్ష్మి మూడో వర్ధంతి సందర్భంగా వరలక్ష్మికి తమ నివాళులు అర్పించారు. కుందూరు వరలక్ష్మి దామరచర్ల సర్పంచ్ గా పనిచేస్తూ ప్రజా శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేసిందని వరలక్ష్మీ గురించి ఇంకా మరెన్నో విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు ముగ్గుల పోటీల గురించి మాట్లాడుతూ..

ముగ్గుల పోటీలు సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు. ఈ ముగ్గుల పోటీలలో వేసిన ప్రతి ముగ్గు చాలా బాగున్నాయని, “సంక్రాంతి ముగ్గులు” వేసిన వారు సంక్రాంతి పండు గ గురించి తమ “మనసులోని భావాలను” తెలియపరుస్తూ ‘ముగ్గుల రూపంలో ‘చిత్రీకరించారని భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జిల్లా రైతు బందు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, జడ్పీటీసీ అంగోతు లలిత హతిరం, మైనారిటీ నాయకులూ యూసుఫ్, మండల కో ఆప్షన్ సభ్యులు నాగుల్ మీరా, పడిగాపాటి పెద కోటిరెడ్డి, ఎం.పీ.టీ.సీ లు.. సోము సైదిరెడ్డి, బాల లక్ష్మి సత్యనారాయణ.. లు, కుందూరు శ్యాం సుందర్ రెడ్డి, బైరం నర్సయ్య, దారగాని వెంకటేశ్వర్లు, ఖాసిం, పడిగాపాటి శ్రీనివాస్ రెడ్డి, కొండారపు బ్రదర్స్, నీరుకంటి శ్రీనివాస్ నాయుడు, రఫీ, బి ఆర్ఎస్ నాయకులు,ముగ్గుల పోటీలలో పాల్గొన్న అభ్యర్థులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు, వీక్షించారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి