
జనసముద్రం న్యూస్,శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్,:జనవరి,12:

అమడగూరు న్యూస్: మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర హళ్లి క్షేత్ర “ఎమ్మెల్యే కృష్ణప్ప” గురువారం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి కుటుంబ సమేతంగా అందరూ కలిసి ప్రత్యేక పూజలు,అభిషేకాలు,అర్చనలు,నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే కృష్ణప్ప మాట్లాడుతూ…మా ఇంటి దేవత శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆశీస్సులతోనే నేడు నేను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు.భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందడానికి అమ్మవారి ఆశీస్సులతోనే ముందుకెళ్తానని అన్నారు.అంతేగాక ప్రజలకు నిరంతరం వారి సమస్యల కోసం పాటుపడతానని ఆయన తెలిపారు.కర్ణాటకలో “ముఖ్యమంత్రి బసవరాజు బోమ్మై” బాగా పనిచేస్తున్నారని వచ్చే ఎన్నికలల్లో కూడా కచ్చితంగా బిజెపి గెలుస్తుందని దిమ్మ వ్యక్తం చేశారు.అలాగే కేంద్ర మంత్రి వర్గంలో అమ్మవారి ఆశీస్సులతో తనకి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం కర్ణాటక రాజ్య ఒక్కలగిరి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నానని తెలిపారు.అలాగే ఏపీ రాజకీయాలపై ఆరా తీశారు.ఆలయంలో వర్షాల వల్ల నీళ్లు నిలువ ఉంటున్నాయని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన ఆలయంలో నీళ్లు ఊరకుండా శాశ్వత పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అంతేకాకుండా కళ్యాణమండపం వసతి గదులు,పార్కింగ్,ప్రహరీ గోడ పనులు చేయడానికి తన సహకారం అందిస్తానన్నట్లు ఆయన తెలియజేశారు.కావున పనులను వేగవంతంగా చేయాలని ఆయన సూచించారు.అనంతరం మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…కర్ణాటక ఎమ్మెల్యే కృష్ణప్ప అన్న చొరవతో అమ్మవారి ఆలయం దిన దిన అభివృద్ధి చెందుతుందని వారే లేకుంటే అమడగూరు మండలం అనేది ఎవరికి తెలియదని అంతేకాకుండా అమడగూరు మండల వాసులకు నిత్య అన్నదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే కృష్ణప్ప మరియు కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలు కలిగి రాజకీయంగా మరిన్ని పదవులు అలంకరించి మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మంజునాథ్,శీనప్ప,మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,ఆలయ ధర్మకర్త లక్ష్మప్ప స్వామి,కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి,లక్ష్మీనారాయణ,రఘు,నరసింహమూర్తి,సప్లయర్ రమేష్,బిజెపి జిల్లా అధ్యక్షులు సుబ్బిరెడ్డి,రామంజులు నాయుడు,కర్ణాటక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.
