

జన సముద్రం న్యూస్,అనంతపురం జిల్లా ఆత్మకూరు:
ఆత్మకూరు మండల కేంద్రము లోనీ ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భవతులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని వైద్య అధికారిని సుల్తాన్ పేర్కొన్నారు గ్రామీణ ఆరోగ్య కేంద్రం ఆత్మకూరు నందు ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హై రిస్క్ గర్భిణులు అంటే గత కాన్పులో సిజేరియన్ అయిన వాళ్లు, పొట్టిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు,రక్తపోటు సమస్య ఉన్న వాళ్ళు,గుఱ్ఱపు వాతం లాంటి సమస్యలు గల వాళ్ళుకు ఈరోజు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారికి పౌష్టికాహారం, గర్భిణులు చేయించుకునే చెక్ అప్ లు,తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలని సూచనలు చేయడం జరిగింది.
అలాగే కిల్కారి అనే ప్రత్యేక మొబైల్ యాప్ ద్వార గర్భిణులకు ప్రతి 15 రోజులకు ఒకసారి వారివాయిస్ మెసేజ్ వచ్చే విదంగా ప్రభుత్వం కొత్త యాప్ ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ యాప్ వాయిస్ మెస్సేజ్ ద్వారా గర్భిణులు ఏ సమయంలో ఏ చెకప్ రావాలి,వారు తీసుకోవాల్సిన ఆహారం గురించి,ఏ సమయంలో ఆసుపత్రిని సందర్శించాలానే విషయాల పై అవగాహన కల్గించడం జరుగుతుంది. కాబట్టి గర్భిణులు అవగాహన కల్గి వుండి సూచనలు పాటించాలని తెలియజేయుచున్నాం.
ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ చంద్రావతి, ఎంపీహెచ్ ఈ ఓ లు నాగేశ్వరయ్య, మునాఫ్,సూపర్ వైజరు రత్నమ్మ, ఏఎన్ ఎమ్ లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.