కేసిఆర్ కు బిగ్ షాక్ : విభజన హామీలు,ఆస్తుల పంపకం పై సుప్రీం కోర్టుకు ఏపి ప్రభుత్వం

Spread the love

జనసముద్రం న్యూస్,జనవరి 9:

ఏపీలోకి ఘనంగా ఎంట్రీ ఇద్దామని ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. విభజన అంశాలపై.. ముఖ్యంగా ఏపీకి రావాల్సిన సంస్థల విషయంపై కోర్టుకెక్కింది. 8 ఏళ్లుగా ఈ విషయంలో స్పందించకుండా జాప్యంచేస్తున్న కేసీఆర్ సర్కార్ పై ఇప్పుడు ఫైట్ మొదలుపెట్టడం బీఆర్ఎస్ కు మింగుడుపడని వ్యవహారంగా మారింది.

ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు ఏపీలో అడుగులు వేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం విభజన అంశాల అస్త్రాన్ని తెరమీదకు తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.సుప్రీంకోర్టు గడప తొక్కడం.. రాజకీయంగా కేసీఆర్ కు ఇబ్బందులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఎటువైపు అనుకూలంగా వ్యవహరించినా జాతీయ నేతగా.. కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవు.విభజన చట్టంలో ఉమ్మడి ఏపీలోని ఆస్తులు జనాభా ప్రాతిపదికన పంచుకోవాల్సి ఉంటుంది.  దీనికి తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే అని చెబుతోంది. ఇక ఇప్పుడు సుప్రీం గడప తొక్కిన నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారు.? అనేది ప్రశ్న.

జాతీయ పార్టీ నాయకుడు కావడంతో కేవలం తెలంగాణ వాదాన్ని వినిపిస్తే ఇబ్బందులు తప్పవు. అలాగని చట్టం ప్రకారం వెళితే ఏపీకి మెజార్టీ ఆస్తులు దక్కుతాయి. తెలంగాణ సెంటిమెంట్ కు బొక్కపడుతుంది.ఇక ఏపీకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వమని అంటే రేపు ఏపీలో ఎలా ఓట్లు అడుగుతామన్నది ప్రశ్న. ఏపీకి అన్యాయం చేశారనే వాదన కూడా తెరపైకి వస్తుంది. ఇలాంటి సమయంలో ఏపీలోని జగన్ ప్రభుత్వం విభజన హామీలపై సుప్రీంకోర్టుకు ఎక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ కు ఈ కేసు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెట్టాలా ఉందని అంటున్నారు.

Related Posts

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

Spread the love

Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

Spread the love

Spread the love (జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి) హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి విశ్వ ప్రగతి పాఠశాలను మూసి వేయడం జరిగింది .దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెంది విశ్వ ప్రగతి పాఠశాల నుండి ర్యాలీగా వెళుతూ హుజురాబాద్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు