
జనసముద్రం న్యూస్,పామిడి, జనవరి 09:

గుంతకల్లు నియోజకవర్గం పరిధిలోని పామిడి పంచాయితీ లో 4 వ వార్డు లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పాల్గొనడం జరిగింది. నియోజవర్గ ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ సిపి 175 కు 175 శాసనసభ స్థానాలు వైఎస్ఆర్సిపి నే కైవాసం చేసుకుంటుందని ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి తెలియజేశారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుండి అనేక సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ నవరత్నాల ద్వారా పథకాలను లబ్ధిదారులకు అందుతున్న విషయాన్ని వారి నుండి అడిగి తెలుసుకుంటూ జగనన్నను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సిబి. జానకిరామ్ రెడ్డి , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పేమ్మక చెన్నకేశవ రెడ్డి మరియు జడ్పీటీసీ శోభా మధుసూదన్ రెడ్డి , ఏపీ అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ కుమ్మెత లక్ష్మి, మాజీ కౌన్సిలర్ రుక్మాన్ , మైనార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బి బి ఎస్. ఆసిఫ్ , మార్కెట్ యార్డ్ చైర్మన్ గౌరప్ప , మరియు సర్పంచుల ఫోరమ్ అధ్యక్షలు మూలి నాగేశ్వర్ రెడ్డి ,రూరల్ కన్వీనర్ నారాయణరెడ్డి, టౌన్ కన్వీనర్ బొల్లు వెంకట్రాంరెడ్డి, మైనార్టీ కన్వీనర్ రజాక్ , బీసీ సెల్ అధ్యక్షులు ఓబులేష్, కొండాపురం సునీల్ రెడ్డి , పార్థిశ్వర్ రెడ్డి 4వ వార్డు ఇంచార్జ్ ఈశ్వర్ రెడ్డి, మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, కన్వీనర్లు,స్టోర్ డీలర్లు,మైనార్టీ నాయకులు వైస్సార్ సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పంచాయితీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.