జనసముద్రం న్యూస్, మాదాపూర్, డిసెంబర్ 09:

కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ లో సైబర్ టవర్స్ వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి , టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ , అదనపు , కార్పొరేటర్లు హామీద్ పటేల్ , జగదీశ్వర్ గౌడ్ తో కలిసి సైబర్ లైనర్ టీఎస్‌ఆర్టీసీ ఫ్రీ వై ఫై తో కూడిన 10 మినీ ఏసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకప్పుడు నష్టాలలో ఉన్న టీఎస్‌ఆర్టీసీ ని ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ముందుచూపు తో లాభాల బాటలో ప్రయాణించే ల కొత్త జవసత్వాలను పునికిపుచ్చుకుని లాభాల బాటలో ప్రయాణించే ల చర్యలు తీసుకున్నారు అని అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అని , ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేయుటలో ముఖ్యభూమిక పోషిస్తుంది అని ,ఆర్టీసీ ప్రయాణము సురక్షితం,సుఖవంతం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా ఐటి ఉద్యోగుల కు ఎంతగానో ఈ బస్ లు తోడ్పడుతాయి అని, వారి కార్యాలయలకు, గమ్య స్థానాలకు చేరవేయుటలో కీలక పాత్ర పోషిస్తాయి అని, ఈ మినీ ఏసీ బస్సు లలో ఫ్రీ వై ఫై తో కుడినవి, అన్ని రకాల హంగులతో సకల సౌకర్యాలతో నేటి నుండి అందుబాటులో కి వస్తున్నాయి అని ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, హై టెక్ సిటీ ,రాయదుర్గం, వేవ్ రాక్ ,నానక్ రాం గూడ ఐటి కారిడార్ ప్రాంతములో తిరుగుతాయి అని,
ప్రైవేట్ బస్సులకు ధీటుగా అత్యాధునిక హంగులతో రూపొందించిన ఈ బస్సులు ఈ రోజు నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు, ఇక్కడి ప్రాంత ప్రజలు సద్వినియోగ పర్చుకోవలని ప్రభుత్వ విప్ గాంధ తెలియచేసారు ఈ కార్యక్రమంలో చీఫ్ స్ట్రాటజీక్ ఆఫీసర్ మురళి వరద రాజన్, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి, సెక్యూరిటీ ఫర్ సైబరబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కృష్ణ యెడ్ల మరియు మాజీ కార్పొరేటర్ మాధవర రంగరావు , మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు బలరాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు





