జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణు జె,జనవరి 9:

తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు సర్పంచుల సమస్యలపై ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు,అభిమానులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలని శంకర్ నాయక్ కోరారు.





