జన సముద్రం న్యూస్, కోహెడ, కోహెడ ప్రసాదరావు, జనవరి 9 :

సిద్దిపేట జిల్లా,కోహెడ మండలానికి డబుల్ బెడ్ రూం ఇండ్ల మాట జూటేనా? అరెపల్లి మినహా మరే గ్రామానికి దళితబంధు ఉసేలేదా అని బిజెపి మండల అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం అన్నారు. సోమవారం కోహెడలో ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ, మండల ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుండి కలగానే చూడాలా? దళితబంధు ఒక్క అరెపల్లి గ్రామంలో ఇచ్చి చేతులు దులుపుకొన మిగిలిన 26 గ్రామాల్లో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
శాసన సభ్యులు అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా కొలుస్తున్న ఆ పార్టీ నాయకులు మండల వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరులో దళితబంధు ఇప్పించే విషయంలో నిర్లక్ష్య ధోరణిని విడనాడి డబుల్ బెడ్ రూం, దళితబంధు స్కిం త్వరగా మండల ప్రజలకు అందించాలని సూచించారు లేని పక్షంలో ప్రజల పక్షాన బిజెపి ఆధ్వర్యంలో పోరాటాలకు స్వీకారం చూడతామన్నారు
ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల శ్రీనివాస్,కంది సత్యనారాయణ రెడ్డి,ఎడమల రాజు, ముంజ సాగర్ గౌడ్, చిగురు సంజీవరెడ్డి, ముంజ శివసాయి గౌడ్, ఉత్తునూరి శ్రీకాంత్, ఎడమల రమణారెడ్డి, తదితరులున్నారు.





