జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ ,మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 9:

మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని మిర్యాలగూడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ మనం మూడు పూటలా అన్నం తింటున్నామంటే కారణం అన్నదాతలే నని తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తెలిపారు. ఉమ్మడి దామరచర్ల మండల పరిధిలోని అనేక గ్రామాల లో ప్రభుత్వ భూములకు గతం లో పట్టా పాస్ బుక్ లు వున్న భూములను గత ఎనిమిది సంవత్సరములుగా రైతుల భూములు” పార్ట్ బీ “లో ఉండటం వలన రైతులకు ప్రభుత్వం నుండి రావాల్సిన రైతు బంధు , రైతుభీమా , రైతు రుణాలు కోల్పోయి అన్నదాతలు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లో వున్నారని రైతులకు వెంటనే పార్ట్ బీ లో వున్న ప్రభుత్వ భూముల కు అర్హులైన రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పాస్ పుస్తకాలు అందించి ఆదుకోవాలని రైతుల తరఫున కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు.. బంటు కిరణ్ , చల్లా అంజిరెడ్డి, రామావత్ బాలు నాయక్,జనార్దన్.. లు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ తదితరులు రైతుల పక్షాన పాల్గొన్నారు





