జనసముద్రం న్యూస్, అవంతిపురం,మిర్యాలగూడ మండలం ,మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె,జనవరి 9:

మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని
మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొత్త కాలనీ గ్రామ వాసుల కష్టాలు చాలా భయానకం. ఈ గ్రామ వాసుల ప్రజల కష్టాలు తీర్చాలని వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అవంతిపురం గ్రామం నుండి ఈరోజు కొత్త కాలనీ గ్రామవాసుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లడానికి సిపిఎం మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పాదయాత్రకు నాయకత్వం వహించారు. ఈ పాదయాత్రను మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం వరకు ముగించి ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ని కార్యాలయం ఎదుట గ్రామ వాసులతో కలిసి బైఠ యించి ధర్నా చేశారు .
ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ అవంతిపురం గ్రామపంచాయతీలో పారిశుధ్య సమస్యలు తాండవం చేస్తున్నాయాని, ఈ సమస్యలను పట్టించుకునే అధికారులు లేరని పేర్కొన్నారు. అదే గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొత్త కాలనీ ప్రజలకు త్రాగడానికి కనీసం నీటి సౌకర్యం కల్పించలేని దుర్మార్గమైనటువంటి రాష్ట్రంలో వీరు జీవనాన్ని కొనసాగిస్తున్నారని రంగారెడ్డి పేర్కొన్నారు. అవంతిపురం గ్రామ ప్రజలు మాకు తాగడానికి నీరు ఇవ్వండని, “ఆకలి దాహాలతో ” ప్రజలు అలమటిస్తున్నా అధికారులు వారి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ఈ సమస్యలను పంచాయతీ పాలకవర్గo,మండల అధికారులు చూస్తూ ఉన్నా కూడా సమస్యలను పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. కొత్త కాలనీలో కరెంటు స్తంభాలు కేవలం దిష్టిబొమ్మలుగానే ఉన్నాయని, ఆ ప్రాంతం మొత్తం చీకటిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారని, పేర్కొన్నారు, సిపిఎం బృందం సర్వే కి పోయి వచ్చిన తర్వాత ఒక నాలుగు వీధి బల్బులు వేసి చేతులు దులుపుకున్నారని, అదే పాలకవర్గం వారికి మంచి నీళ్లు ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కొత్త కాలనీలో ఉండే ప్రజలు ఇప్పటికి గుడిసెలలో , బస్తాలతో కప్పి ఉన్నటువంటి పూరి గుడిసెలలో వారు జీవనాన్ని కొనసాగిస్తున్నారని ఇది బంగారు తెలంగాణ రాష్ట్రమా అని జూలకంటి రంగారెడ్డి అవంతిపురం గ్రామ వాసుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ రాష్ట్రము లో జీవిస్తున్నటువంటి కొత్త కాలనీ ప్రజలు “విషసర్పా లు సంచరిస్తున్న ప్రదేశాలలో జీవనం కొనసాగిస్తూ విషసర్పాలా కాటు” తో ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.ఇలా చనిపోయిన వారి కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే అధికారులు అవంతిపురం ప్రాంతంలో పర్యటించి ఆ ప్రాంతంలోని గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అదే గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, అవసరమొస్తే గ్రామ ప్రజలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకొని పోతామని జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి తో పాటు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికర్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఎం మండల కార్యదర్శి రవి నాయక్, జిల్లా నాయకులు పాదూరి శశిధర్ రెడ్డి, హాయూబ్ ఖాన్, వేములపల్లివైస్ ఎంపీపీ పాదురి గోవర్ధన, ఊర్మిళ,నాయకులు లింగయ్య, కందుకూరు రమేష్ బాబు, పిల్లుట్ల సైదులు, గోవిందరెడ్డి రామకృష్ణ,కోటయ్య, వెంకన్న, మోతే సైదులు,శివ వెంకన్న, మాజీ సర్పంచ్ జ్యోతి, లింగయ్య, సిపిఎం నాయకులు అభిమానులు అనంతపురం కొత్త కాలనీ గ్రామ ప్రజలు తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.





