జనసముద్రం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం,జనవరి 9:
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు పరిధిలోని వలస ఆదివాసీ గిరిజన గ్రామం ఐన బుడుగుల యందు మరియు ఖమ్మం తోగు, బుగ్గ గ్రామాల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించి జ్వరాలు ఉన్న వారి నుండి రక్త నమూనా సేకరించి మందులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా గృహ సందర్శన చేసి బాలింత ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు .గృహ సందర్శన లో జ్వరాలు రాకుండ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని , నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని, అని దోమ తెరలు వాడాలని , అదేవిధంగా అసంక్రమిత వ్యాధులు ఐన రక్తపోటు , షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి, వారికి కార్డు ఇచ్చి నెల నెలా మందులు అందజేయాలని డాక్టర్.నిశాంత్ సూచించారు. ఈ కార్యక్రమం లో సూపర్ వైజర్ పుష్పారాణి , రాంప్రసాద్,ఉమెస్, సుజాత, కౌసల్యా, శ్రావణి, రాధ, రమణ , ఎం ఎల్ హెచ్ పి దుర్గా భవాని,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.