జనసముద్రం న్యూస్ పర్వతగిరి జనవరి 9:
పర్వతగిరి మండల కేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్ లో ఉన్న రేగడి మట్టి నీ కొంతమంది దళారులు అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో గ్రీవెన్స్ లో ఆర్ ఎస్ పి వరంగల్ జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్ టిడిపి మండల అధ్యక్షుడు కట్ట వీరభద్రయ్య, బి ఆర్ఎస్ మండల నాయకుడు ఎన్నమనేని వెంకటేశ్వరరావు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు
రిజర్వాయర్ నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు నిధులు కేటాయించిరిజర్వాయర్ పనులు పూర్తి చేసి రిజర్వాయర్ ను నీటితో నింపవలసిన అధికారులు నీటితో నింపకుండా రిజర్వార్.లో ఉన్న రేగడి మట్టిని ఇటిక బట్టీల కోసం అక్రమ దారులు తరలిస్తున్న స్థానిక ఐబీ అధికారులు మట్టి అక్రమ దారులతో కుమ్ముక్కై అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఐబీ అధికారుల అవినీతిపై సమగ్ర విచారణ జరిపినట్లయితే వాస్తవాలు బయటికి వస్తాయి రిజర్వాయర్ రాగడి మట్టిని అక్రమంగా తరలించకుండా చర్యలు తీసుకొని తక్షణమే రిజర్వాయర్ ను నీటితో నింపి భూగర్భ జలాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు