తల్లి తండ్రు లారా..మీ పిల్లలు జర జాగ్రత్త..సైబర్ క్రైమ్ ఉచ్చులో పడొచ్చు..?

Spread the love

జనసముద్రం న్యూస్, జనవరి 9, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జే :

మనదేశంలో సైబర్ క్రైమ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి,ఇటువంటి సైబర్ నేరాలను “సైబర్ క్రైమ్” లేదా “కంప్యూటర్ ఆధారిత నేరం” కూడా అని అంటారు. ఈ సైబర్ క్రైమ్ నేర గాళ్ళ ఉచ్చులో ఎక్కువగాచదువుకునే “విద్యార్థులు” బలవుతున్నారు. ఎలాగంటే ఇవి ఎక్కువగా ఇంటర్నెట్ లేదా సెల్ ఫోన్ ఆన్లైన్ ద్వారా జరిగే నేరాలుగా పరిగణించబడతాయి. విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలకు సెల్ ఫోన్లు కొని పెడుతూ ఉంటారు మంచిదే కానీ ఆ సెల్ ఫోన్ ద్వారా వారు ఏ విషయాలు తెలుసుకుంటున్నారో తల్లిదండ్రులు గ్రహించే ఉద్దేశం కలిగి ఉండాలి.

సైబర్ క్రైమ్ ద్వారా జరిగే నేరాలు.. ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ లేదా సెల్ ఫోన్ లో హ్యాకింగ్ చేయడం, నకిలీ బ్యాంకు లింకులు పంపడం, “తక్కువ ఆఫర్ అని చెప్పి ఆశ చూపడం”, ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్ లలో తెలియని లింకులు క్లిక్ చేయడం, వాట్సాప్ లలో వచ్చే తెలియని లింకులు క్లిక్ చేయడం, మీకు ఖరీదైన వస్తువులు తక్కువ డబ్బులకే ఇస్తాము అని చెప్పి నాసిరకపు వస్తువులు ఇచ్చి మోసం చేయడం, ఆన్లైన్లో అమ్మాయిల ఫోటోలను పెట్టి ఆశ చూపించి మోసం చేయడం, మీకు ఫోన్లో బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెప్పి మీ ఓటీపీ నెంబర్ ను అడిగి మిమ్మల్ని మోసం చేసి మీ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం….. ఇంకా చెప్పుకుంటూ పోతే సైబర్ క్రైమ్ లో సైబర్ క్రైమ్ మోసగాళ్ల ఉచ్చులో పడి చాలామంది ప్రజలు మోసపోయి బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని సైబర్ క్రైమ్ మోసగాళ్లు దారుణాలకు పాల్పడుతున్నారు. కంప్యూటర్ లేదా సెల్ ఫోన్ లో మహిళల చిత్రాలను తీసుకొని వాటిని అశ్లీలంగా చిత్రీకరించి ఇంటర్నెట్లో విడుదల చేస్తామని మహిళలను బెదిరించి వాళ్ల దగ్గర సొమ్ము చేసుకున్న సైబర్ నేరగాళ్ల కేసులు ఎన్నో ఉన్నాయి..

సైబర్ క్రైమ్ మోసగాళ్ల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి… ముందుగా మీ సెల్ ఫోను ను తెలియని వారి చేతికి ఇవ్వకూడదు. మీ యొక్క సెల్ ఫోన్ కు లాక్ సిస్టం కచ్చితంగా ఏర్పరుచుకోవాలి.ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు మీ యొక్క సెల్ ఫోన్ నుంచే అన్ని విషయాలు తెలుసుకునేటట్టు చూసుకోవాలి. ప్రతిరోజు మీ పిల్లల సెల్ ఫోన్లు చెక్ చేస్తూ ఉండాలి. మొబైల్ లేదా కంప్యూటర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మొబైల్లో లేదా కంప్యూటర్లో వచ్చే అనవసరపు లింకులను క్లిక్ చేయడం, మీ యొక్క బ్యాంక్ ఎకౌంటు పాస్వర్డ్ ను ఎవరికీ చెప్పకుండా ఉండటం.. వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్ క్రైమ్ మోసగాళ్ల ఉచ్చులో పడి మీరు చాలా కోల్పోవాల్సి వస్తుంది. సైబర్ క్రైమ్ మోసగాళ్ల బారిన పడినవారు సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులను ఆశ్రయించడం మంచిది. సైబర్ క్రైమ్ కు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అన్ని రకాల నేరాలకు శిక్షలు ఉన్నాయి. సైబర్ క్రైమ్ బారిన పడినవారు సైబర్ క్రైమ్ పోలీసులకు మరియు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్ కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

  • Related Posts

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్ గాంధారి డిసెంబర్ 12 గాంధారి మండలం నేరేళ్ తండా గ్రామంలో గంజాయి సరఫరా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు తేదీ 10.12.2024 నాడు సాయంత్రం సమయంలో గాంధారి SI ఆంజనేయులు మరియు తన సిబ్బందితో…

    అక్రమ కలప దాచిన రవాణా చేసిన ఉపేక్షించేది లేదు

    Spread the love

    Spread the love ఇంధన్ పెళ్లి అటవీ రేంజ్ అధికారి :కారం శ్రీనివాస్ ఖానాపూర్ నియోజకవర్గం డిసెంబర్ 12జనసముద్రం న్యూస్కవ్వాల్ అటవీ ప్రాంతంలో అక్రమంగా కలప గానీ అక్రమంగా విలువ ఉంచిన వాటిని రవాణా చేసిన లేదా మెటీరియల్ గా ఇలాంటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు