జన సముద్రం న్యూస్,జనవరి 08,అనంతపురం:
అనంతపురం లోని స్థానిక లెక్చరర్స్ కాలనీ వాలంటీర్ శ్రీమతి షర్మిల భర్త మహమ్మద్ రఫీ(35)ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా కాలనీ
అసోసియేషన్ గౌరవాధ్యక్షులు క్రిష్ణా రెడ్డి,అధ్యక్షులు విశ్రాంత RIO క్రిష్టప్ప,సెక్రెటరీ వెంకట రంగయ్య ,కోశాధికారి దామోదర్ రెడ్డి,సభ్యులు మస్తానప్ప, టీవిరెడ్డి,నారాయణ,ఉమామహేశ్వరి ,ఈరాస్వామి తదితరులు షర్మిల కుటుంబానికి తమ సానుభూతిని తెలిపారు. .కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసుల నుండి వసూలుచేసిన విరాళాల మొత్తం. 31,500 రూ”లు ఆర్థిక సహాయంగా వాలంటీర్ షర్మిల గారికి అందజేయడం జరిగింది.ఆర్థిక సహకారం అందించిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియ జేశారు.