
జనసముద్రం న్యూస్,జనవరి 08,ఉరవకొండ::

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా మీరం బాషా నియమితులైన సందర్భంగా ఆదివారం పట్టణంలోని పాత బజార్ గర్ల్స్ హైస్కూలు సమీపంలో ప్రత్యేక సన్మానసభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహమ్మద్, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ రిజ్వాన్,యువనేత ప్రణయ్ రెడ్డి,వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ అహమ్మద్ బాషా,జాయింట్ సెక్రటరీ ఖాజా, ఖతిమ్ అబ్దుల్ హై,తదితరులు హాజరయ్యారు.ముందుగా బాబా పక్రుద్దీన్ జెండా కట్ట వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం ముస్లిం మైనారిటీలకు మంచి చేసినందుకు కృతజ్ఞతగావారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా వక్ఫ్ బోర్డు మెంబర్ గా నియమితులైన మీరంబాషా నాయకులు, పలువురు పూలమాలలు,శాలువాలతో సత్కరించారు. సన్మానసభలో ముందుగా స్వర్గస్తులైన వైస్సార్సీపీ నాయకులు జీఎంఎస్ హఫీజ్, టెక్కీ హుస్సేన్ అహమ్మద్, జీఎంఎస్ మహబూబ్ బాషా, వడ్ల గఫుడ్, శర్మస్ ల ఆత్మ శాంతికి ఒక నిమిషం పాటు మోనం పాటించారు. అనంతరం కో అప్షన్ మెంబర్ పామిడి సలీం అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ కెబినెట్‌లోను, రాష్ట్ర ఛైర్మెన్ల నియామకంలో సిఎం జగన్మోహన్‌రెడ్డి 60 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించారన్నారు.ఒక మైనారిటీకి డిప్యూటీ సీఎంను చేసిన ఘనత జగన్ కే దక్కిందన్నారు. అదే విదంగా మైనార్టీలకు మండలి చైర్మన్ ను చేసారని, 5 మందికి ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్టు ఇచ్చి మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి జగన్ కు ఉన్న ప్రేమను చాటుకున్నారని తెలిపారు.ఉరవకొండ పట్టణంలో మూడు వేల ఇళ్ల పట్టాలు ఇస్తే అందులో 1100 మంది మైనార్టీలకు ఇంటి స్థలాలు ఇచ్చామని చెప్పారు.అదే విదంగా మహిళా సంఘాల రుణమాఫీలో స్థానిక ముస్లిం మహిళలు 500 మందికి న్యాయం జరిగిందన్నారు. అదేవిధంగా పట్టణంలో ఉర్దూ పాఠశాల అభివృద్ధికి నాడు -నేడు కింద 28 లక్షల రూపాయలు తమ ప్రభుత్వం మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టిందని చెప్పారు. ఇలా అనేక కార్యక్రమాల్లో ముస్లిం లకు న్యాయం చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు.మైనార్టీలకు ఇంత సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతారన్నారు.
ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని మసీదులు దర్గాలు అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయలు మంజూరు చేస్తారని చెప్పారు. ఈ నిధులతో ఉరవకొండ నియోజకవర్గంలోని మసీదులు దర్గాలు అభివృద్ధి పరుస్తామని తెలిపారు. వీటితోపాటు ఉరవకొండలో గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై నిర్మాణ మధ్యలో ఆగిపోయిన షాదిఖానాకు కూడా నిధులు తెచ్చి పూర్తి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీల కోసం ఇన్ని మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మైనార్టీలందరూ అండగా నిలవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ వడ్ల షేక్షావలి, వార్డు సభ్యులు శర్మస్, ఎంపిటిసి హోన్నూరు సాబ్,కో అప్షన్ సభ్యులు లతీఫ్ షహవాజ్ బేగం,గుత్తి బాను,నాయకులు అన్వర్, తాజు, ఆసిఫ్,కపట్రాళ్ల జాఫర్, అయ్యర్ దాదు, జెండా జీలన్, జీఎంఎస్ వలి అహమ్మద్, నూరు అహమ్మద్,షాకిర్, వజ్రకరూరు ఉస్మాన్, దర్గా కమిటీ అధ్యక్షుడు హోతూరు బాషా,వడ్ల సలీం,బ్యాళ్ల ప్రసాద్, ఇంతియాజ్, జీలన్,బేల్దార్ శర్మస్, ఫొటో ఫ్రెమ్ ఖాదర్, రఫీ,తాజు,మమ్మి, ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు,మైనారిటీలు తదితరులు పాల్గొన్నారు.