కేసిఆర్ కు,బీఆర్ఎస్ పార్టీకి ఏపి లో అడుగుపెట్టే అర్హత లేదు : మంత్రి ఆర్కే రోజా

Spread the love
జనసముద్రం న్యూస్,జనవరి 03:

భారత రాష్ట్ర సమితి(బీఆర్  ఎస్)కి ఏపీలో అడుగు పెట్టే అర్హత లేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. నీళ్లు నిధులు నియామకాలు అనే సెంటిమెంటునురెచ్చగొట్టి ప్రత్యేక రాష్ట్రం తీసుకున్న కేసీఆర్ కు ఏపీతో పనేంటని ఆమె ప్రశ్నించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ ఏపీలో అడుగు పెడుతున్న వైనంపై మాట్లాడుతూ.. ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు.

ఏపీలో బీఆర్ ఎస్కు ఏం పని? అని రోజా ప్రశ్నించారు. బీఆర్ ఎస్లో చేరే ఏపీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసి.. రాజధానిని అడ్డగోలుగా దోచుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కేసీఆరేనని.. ఇప్పుడు ఆయన ఏ మొహం పెట్టుకుని ఏపీలో అడుగు పెడతారని రోజా విమర్శించారు. కొత్త రాష్ట్రాన్ని కోరుకున్న వారు(తెలంగాణ) తమకు కొత్త రాజధానిని నిర్మించుకోవాలని కానీఅప్పటికే అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్ను తీసుకున్నారని దుయ్యబట్టారు.
“సెంటిమెంటుతో రాష్ట్రం తీసుకున్నారు. ఏదైనా ఉంటే అక్కడే రాజకీయం చేసుకోవాలి. ఏపీతో ఏపీలో ఏం పని? ఇక్కడ నుంచి బీఆర్ ఎస్లో చేరే నాయకులకు ఏపీ ప్రజలే బుద్ధి చెబుతారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే.. టీడీపీ ఎమ్మెల్యేలే అయి ఉంటుంది.
వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ బీఆర్ ఎస్లో చేరరు. మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరూ కలిసి పనిచేస్తున్నారు సీఎం జగన్ను మరోసారిముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం“ అని రోజా వ్యాఖ్యానించారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్