పింఛన్ల లబ్ధిదారులకు దొంగ నోట్లు పంపిణీ చేసిన వాలంటీర్లు..!!

Spread the love

జనసముద్రం న్యూస్,జనవరి 03:

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లబ్ధిదారులకు పింఛన్ల సొమ్ము కింద దొంగ నోట్లు అంటగట్టిన వ్యవహారంలో మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 1న కొత్త సంవత్సరం నాడు పింఛన్ల పంపిణీలో దొంగనోట్లు రావడంతో ఓ వలంటీరును పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఆ వలంటీర్ ఇచ్చిన సమాచారం మేరకు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని మిట్టమీదపల్లె లోయపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి బాధితులు పోలీసుల కథనం ప్రకారం.. నరసాయిపాలెం ఎస్సి కాలనీ గ్రామ వలంటీరుగా ముటుకూరి ఆమోష్ పని చేస్తున్నాడు. ఒకటో తేదీ కావడంతో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ డబ్బులలో రూ.19500 పక్కకు తీసి తన దగ్గర ఉన్న రూ.19.500 దొంగ నోట్లను (రూ.500 నోట్లను) అందులో కలిపాడు. 24 మంది లబ్ధిదారులకు రూ.2750 చొప్పున పింఛను పంపిణీ చేశాడు. ఇందులో కొంతమందికి నకిలీ నోట్లు వెయ్యి రూపాయల చొప్పున కలిపి ఇచ్చాడు.ఈ క్రమంలో పింఛను డబ్బులు తీసుకున్న బంగారమ్మ అనే మహిళ తన బంధువులకు ఫోన్ పే చేయించేందుకు వెళ్లింది. ఇందుకోసం దుకాణదారునికి డబ్బులు ఇచ్చింది. ఇందులో దొంగ నోట్లు ఉన్నట్లు ఆయన గుర్తించి ఆమెకు తెలియజేశాడు.

ఈ విషయం తెలుసుకున్న మిగతా లబ్ధిదారులు కూడా తాము తీసుకున్న పింఛను డబ్బులను దుకాణదారు దగ్గరకు తీసుకెళ్లి చూపించగా వాటిలోనూ దొంగ నోట్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని నరసాయిపాలెం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ పేరయ్య ఎంపీడీవో ఎం.రంగసుబ్బరాయుడు దృష్టికి లబ్ధిదారులు తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో పోలీసులతో కలిసి నరసాయిపాలేనికి ఎంపీడీవో వచ్చి నిలదీయడంతో తానే దొంగనోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వలంటీర్ ఒప్పుకున్నాడు. ఎంపీడీవో ఫిర్యాదు మేరకు వలంటీరును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దొంగనోట్లు వలంటీర్కు ఎలా వచ్చాయి? ఇటువంటి చర్యకు పాల్పడడం ఇదే తొలిసారా? ఇందుకు ముందుకూడా ఇలా చేశాడా? ఈ దొంగనోట్ల వెనుక ఎవరు ఉన్నారు? తదితర విషయాలపై విచారణ చేశారు.

ఇప్పుడు అతడు ఇచ్చిన సమాచారం మేరకే  పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని మిట్టమీదపల్లె లోయపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.

Related Posts

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

Spread the love

Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి