ఏపి లో సర్పంచ్ ల దీన గాథలు..ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేస్తున్న ఒమ్మెవరం సర్పంచ్

Spread the love

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28:

ఏపీలో అన్నీ చేస్తున్నాం.. శక్తికి మించి ఎన్నో చేస్తున్నాం.. అని సీఎంజగన్ పదే పదే చెబుతున్నారు. కానీ ఆయన చెబుతున్నదానికి క్షేత్రస్తాయిలో జరుగుతున్న దానికి ఈ ఫొటోనే దర్పణం పడుతోందని అంటు న్నారు పరిశీలకులు. గ్రామస్థాయిలో గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ మద్దతు దారులకు ప్రజలు పట్టం కట్టారు. అయితే నిధులు ఇవ్వకుండా పాలక పార్టీ పంచాయతీల ను ఎండగడుతోంది.

పోనీ.. కేంద్రం ఇస్తున్న నిధులు అయినా.. ఇస్తోందో అంటేదొడ్డిదారిలో వాడేసుకుంటోందని సర్పంచులు రోడ్డున పడుతున్నారు. తాజాగా టీడీపీ మద్దతు దారుగా ఉన్న ఓ సర్పంచ్(పార్టీ ఏదైనా గ్రామానికి లీడరే కదా)కంచం పట్టుకుని బిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది.నిధులు లేక..నానా అగచాట్లు పడుతున్నామని ఆయన వాపోతున్నారు. అంతేకాదు.. తమపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఓటేసిన ప్రజలకు ఆయన క్షమాపణలు చెబుతున్నారు.ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం ఒమ్మెవరం సర్పంచ్ ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తూ తన పరిస్థితిని వివరిస్తున్నాడు. కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సంఘం నిధులను  ప్రభుత్వం  వాడేసుకోవడంతో పనులు చేసేందుకు డబ్బులు లేకుండా పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దుస్థితి చూశాక వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.తమ వారు కూడా ఇవే ఇబ్బందులు పడుతున్నారని.. క్షేత్రస్థాయిలో సెగ పెడుతున్న ఇలాంటి సంగతులపై దృష్టి పెట్టకపోతే.. ఇబ్బందులు తప్పవని అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పంచాయతీ స్థాయిలో సెంటిమెంట్లకు పెద్దపీట వేస్తారు.

ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యతిరేక సెంటిమెంటు పుంజుకుంటే ఇబ్బంది తప్పదని చెబుతున్నారు.

Related Posts

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

Spread the love

Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్