పాకిస్థాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం..మరో శ్రీలంక లా మారుతున్న పాకిస్థాన్.!

Spread the love

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 25 ;

కరోనా తర్వాత ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికా.. యూరప్ దేశాలు ఇప్పటికే ఆర్థిక మాంద్యంపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా దేశాలు ఆర్థిక వ్యవస్థ మరింత పతనం కూడా చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ కొన్ని దేశాలపై కరోనా ఎఫెక్ట్ భారీగానే పడింది.

పర్యాటకులపై ఆదాయం ఆర్జించే పలు దేశాలు కరోనా అనంతరం కాలంలో దివాళా తీశాయి. మన పొరుగుదేశం శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం మన కళ్లారా చూశాం. ఆ దేశంలో పెట్రోల్.. డీజీల్.. గ్యాస్.. నిత్యావసర ధరలు వేల రూపాయాలకు చేరుకోవడంతో ప్రజలు అంతంత పెట్టి కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంక్ శ్రీలంకకు పెద్ద మొత్తంలో సాయం చేయడంతో అక్కడి పరిస్థితులు ఇప్పుడిప్పుడే దారికొస్తున్నాయి. కాగా శ్రీలంక బాటలోనే పాకిస్తాన్ సైతం నడుస్తుండటం ఆందోళనను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం దయాది పాకిస్తాన్ లో నగదు కొరత తీవ్రంగా ఉంది. దీనికితోడు విదేశీ నిల్వలు తగ్గడంతో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనుందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ గగ్గోలు పెడుతోంది.

పాకిస్తాన్లో భారీగా పెరుగుతున్న ధరలను కట్టడి చేయకుండా.. వృద్ధి లక్ష్యాలపై దృష్టి పెట్టడాన్ని సెంట్రల్ బ్యాంక్ తప్పుబట్టింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ఇందుకు కారణమవుతున్నాయని తీవ్రంగా విమర్శించింది. పెరుగుతున్న ధరలు.. ఆర్థిక స్థిరత్వాన్ని పణంగా పెట్టి వృద్ధికి ప్రాధాన్యతనిచ్చే దేశాలు వాటిని నిలబెట్టుకోలేక పోయిన అనుభవం అంతర్జాతీయంగా పదేపదే నిరూపించబడిందని పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల ఉటంకించింది.

పాకిస్తాన్లో తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే 2023 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిపై సెంట్రల్ బ్యాంక్ దృష్టి పెట్టడం మానేసింది. అయినా  ఆర్థిక.. ధరల స్థిరత్వాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకే FY23లో పాకిస్థాన్ ఆర్థిక అంచనాల కంటే  3 నుంచి 4శాతం కన్నా తక్కువ వృద్ధి రేటు ఉంటుందని ఎస్బీపీ అంచనాలను డాన్ వార్తా పత్రికలో ఒక నివేదించింది.అలాగే వృద్ధిలో తీవ్ర క్షీణత కారణంగా వ్యాపార.. పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగుల భారీ తొలగింపులకు దారితీసింది. దీంతో బిజినెస్ సైకిల్ స్తంభించిపోయింది. ధరలు పెరుగుతున్న వాటిని ప్రభుత్వం కంట్రోల్ చేయకపోవడంతో ద్రవ్యోల్బణం 25శాతానికి చేరుకుంది. ఇది గత ఐదునెలల ఆర్థిక పరిస్థితి దిగజారుడుకు అద్ధం పడుతోంది.

ప్రస్తుతం పాకిస్థాన్లో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఎనిమిదేళ్ల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. డిసెంబర్ 16 నాటికి 6.1 బిలియన్ డాలర్లకు దిగజారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న విదేశీ నిల్వలు ఒక నెల దిగుమతుల చెల్లింపులకు మాత్రమే సరిపోతుంది. దీంతో ప్రభుత్వం నెల రోజుల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయకుంటే పాకిస్థాన్ సైతం శ్రీలంక మాదిరిగా పతనమవడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related Posts

అమెరికా జోక్యం..భారత్ విషయంలో ముసుగు తీసేసిందా…!?

Spread the love

Spread the loveఅమెరికాను ప్రపంచ పోలీస్ అని ముద్దుగా పిలుస్తారు. ఈ పోలీసు కి ఎక్కడ లేని విషయాలూ కావాలి. తనది కానిది కూడా తన సొంతమే అనుకునే వైఖరి అని తెల్ల దేశం మీద ఒక గట్టి భావన. తాము…

టెన్త్ అమ్మాయికి గంజాయి ఇచ్చి అత్యాచారం!

Spread the love

Spread the loveజగిత్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అమ్మాయిలే లక్ష్యంగా.. వారికి గంజాయి ఇచ్చి అలవాటు చేసి, అనంతరం వారిని బానిసలుగా చేసి, వారిని రేవ్ పార్టీలకు తీసుకెళ్తూ, వ్యభిచార కూపంలోకి లాగుతూ అనేక ఘోరాలకు పాల్పడుతున్న…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు